Begin typing your search above and press return to search.

ప్రభాస్ హీరోయిన్ జాక్ పాటు..100 కోట్లే..

By:  Tupaki Desk   |   16 Sep 2018 11:24 AM GMT
ప్రభాస్ హీరోయిన్ జాక్ పాటు..100 కోట్లే..
X
బాలీవుడ్ లో ఓ హరర్ కామెడీ ఫిలిం 100 కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది.రాజ్ కుమార్ రావ్ - శ్రద్ధాకపూర్ జంటగా హిందీలో తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘స్త్రీ’ ట్రేడ్ పండితుల అంచనాలను తలకిందులు చేసింది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఆగస్టు 31న విడుదలైన ఈ మూవీ మూడు వారాల్లోనే రూ.101.43 కోట్లు వసూలు చేసి అందరికీ షాకిచ్చింది.

హాలీవుడ్ మూవీ ‘నన్’ - అనురాగ్ కశ్యప్ మూవీ ‘మన్మర్టియాన్ ’ లాంటి చిత్రాల పోటీని తట్టుకొని ఈ సినిమా సత్తా చాటడం విశేషం. అసలు స్త్రీ సినిమాకు అయ్యింది కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ మాత్రమే. ఈ చిత్రాన్ని అమర్ కౌశిక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. నాలే బా అనే గ్రామంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ హర్రర్ మూవీని తీశారు. ఈ తక్కువ బడ్జెట్ మూవీ బాలీవుడ్ లో కాసుల వర్షం కురిపించడం సినీ పండితులనే ఆశ్చర్యపరిచింది.

కాగా ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరి నిర్మాతకు లాటరీ తగిలేలా చేసిందని ట్వీట్ చేశారు. మూడో వారంలోనే ఈ ఘనత సాధించడం విశేషమని చెప్పుకొచ్చారు. 100 కోట్ల క్లబ్ లో తన సినిమా చేరడంపై శ్రద్ధాకపూర్ స్పందించారు. కంటెంట్ ఉంటే ఆడుతుందనడానికి ఈ సినిమా ఉదాహరణ అని పేర్కొంది. ప్రస్తుతం శ్రద్ధా తెలుగులో ప్రభాస్ తో కలిసి ‘సాహో’లో నటిస్తోంది.