Begin typing your search above and press return to search.
ఐశ్వర్యారాయ్ పై క్రష్ అయ్యింది!
By: Tupaki Desk | 28 Jan 2019 1:30 AM GMT`కాఫీ విత్ కరణ్` షోలో తొలి క్రష్ గురించి, ఎఫైర్ల గురించి కాస్తంత ఘాటుగానే చర్చ సాగుతుంటుంది. అడగకూడని ప్రశ్నలు అడిగేస్తూ టీవీ షోకి టీఆర్పీ పెంచడంలో కరణ్ ఘనాపాటి అని నిరూపించాడు. అప్పట్లో అనుష్కపై ప్రభాస్ క్రష్ గురించి, త్రిషపై రానా క్రష్ గురించి ప్రశ్నల పరంపర సాగింది. వారం వారం ఎపిసోడ్స్ లో ఆలియా, దీపిక, సోనమ్ వంటి టాప్ స్టార్ల క్రష్ గురించి కరణ్ గొప్పగానే ప్రశ్నించాడు.
లేటెస్టుగా కరణ్ షోలో రాజ్ కుమార్ రావ్ కి ఇలాంటి ఓ ప్రశ్న ఎదురైంది. మీ తొలి క్రష్ ఎవరిపై అని కరణ్ .. యువహీరోని ప్రశ్నించాడు. వెంటనే అతడు తడుముకోకుండా ఐశ్వర్యారాయ్ పేరు చెప్పాడు. `ఫనే ఖాన్` చిత్రంలో రాజ్ కుమార్ రావ్- ఐశ్వర్యారాయ్ జంటగా నటించారు. ఈ సినిమా సెట్ లో తొలిసారి ఐష్ ని కలుసుకున్నప్పుడు తనపై క్రష్ ఏర్పడిందని ఓపెన్ గానే చెప్పాడు రాజ్ కుమార్ రావ్. అప్పట్లో `ఫనే ఖాన్` రిలీజ్ టైమ్ లో తమ మధ్య కెమిస్ట్రీ గొప్పగా పండిందని.. నగరంలో కొత్త జంటలా ఉన్నారంటూ అందరూ కితాబిచ్చేశారని తెగ ఉబ్బితబ్బిబ్బవుతూ ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
ఆన్ లొకేషన్ ఐష్ ఉన్నప్పుడు తాను నెర్వస్ ఫీలై ఫ్రీజ్ అయిపోయేవాడినని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఐశ్వర్యారాయ్ పై యువతరం క్రష్ సహజమే. రాజ్ కుమార్ రావ్ అదే తీరుగా ఈ షోలో స్పందించాడు. ఐశ్వర్యారాయ్ అంటే తనకు ఎంత గౌరవమో రాజ్ కుమార్ రావ్ ఓ సందర్భంలో గొప్పగా చెప్పాడు. క్రష్ వేరు.. రెస్పెక్ట్ వేరు అన్నది అతడి మాటల్ని బట్టి అర్థమైంది.