Begin typing your search above and press return to search.

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్- భ‌గత్ సింగ్ పాత్ర‌ల్లో ల‌క్కీ హీరో

By:  Tupaki Desk   |   29 Jun 2023 11:08 AM GMT
నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్- భ‌గత్ సింగ్ పాత్ర‌ల్లో ల‌క్కీ హీరో
X
నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణం వెన‌క‌ మిస్ట‌రీపై సినిమా అంటూ నిఖిల్ 'స్పై' గురించి ప్ర‌చారం సాగినా కానీ ఇది పూర్తిగా ఫిక్ష‌న‌ల్ పాత్ర‌ల‌తో నేతాజీ జీవితంలోని సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తీసిన సినిమా అని ట్రైల‌ర్ వీక్షించిన వారికి స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. నిజానికి ఇది నేతాజీపై సినిమా కానేకాదు.. నేతాజీ జీవిత ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తీసిన సినిమా మాత్ర‌మేన‌ని సినీవిశ్లేష‌కులు అంటున్నారు. నేడు విడుద‌లైన స్పై రివ్యూ మ‌రికాసేప‌ట్లో 'తుపాకి'లో అభిమానుల‌కు అందుబాటులోకి రానుంది.

అయితే నేతాజీ రియ‌ల్ స్టోరిపై తీసిన సినిమాలేవీ భార‌తీయ సినిమా హిస్ట‌రీలో లేవా? అంటే ఎందుకు లేవు. ఆయ‌న పాత్ర‌ను పాక్షికంగానో ప‌రోక్షంగానో చాలా సినిమాల్లో ద‌ర్శ‌కులు చూపించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ నిజానికి ఆరేళ్ల క్రిత‌మే నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణం మిస్ట‌రీ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర సిరీస్ రూపొందింది. 2017లో 'బోస్: డెడ్ ఆర్ అలైవ్' అనే ఆన్ లైన్ మినీ-సిరీస్ తెర‌కెక్కింది.

రాజ్ కుమార్ రావు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను పోషించారు. ఈ సిరీస్ ప్రేక్ష‌కులు స‌హా విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలు అందుకుంది. అనేక డిజిటల్ అవార్డులను సాధించింది. ఇప్పుడు ఆరు సంవత్సరాల తరువాత స్పై నేతాజీ క‌థ స్ఫూర్తితో రూపొందించి రిలీజ్ చేస్తున్నారు. అయితే రాజ్ కుమార్ రావు న‌టించిన సిరీస్ తో పోలిస్తే 'స్పై' లో వైవిధ్యం ఏమిట‌న్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

భ‌గ‌త్ సింగ్ పాత్ర‌లోను..!

తాజా క‌థ‌నాల‌ ప్రకారం రాజ్‌కుమార్ రావు మరో ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నార‌ని తెలిసింది. హిందీ పరిశ్రమ సోర్స్ ప్రకారం.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను విజయవంతంగా పోషించిన రాజ్ కుమార్ రావు త‌దుప‌రి ప్రాజెక్ట్ లో దిగ్గజ యువ‌నాయకుడు భగత్ సింగ్ పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. రాజ్ కుమార్ రావు భగత్ సింగ్ పై ప్రాజెక్ట్ చేయాల‌ని మక్కువ చూపుతున్నారని త్వరలో విప్లవ నాయకుడిగా నటిస్తాడ‌ని ప‌రిశ్ర‌మ‌లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. రచయితల బృందం ఇప్ప‌టికే భగత్ సింగ్ జీవితంలోని ఎపిసోడ్ లను పరిశోధించడంలో బిజీగా ఉన్నందున ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉంది. రాజ్ కుమార్ రావు స్వయంగా స్క్రిప్ట్ డెవలప్ మెంట్ ప్రాసెస్ లో నిమగ్నమై దీనిని త‌న పెట్ ప్రాజెక్ట్ గా పరిగణిస్తున్నారట‌.

ఇంతకు ముందు చేసిన వాటికి భిన్నంగా భగత్ సింగ్ చుట్టూ కంటెంట్ ను రూపొందించాలని చిత్ర‌బృందం ప్ర‌య‌త్నిస్తోంది. సాంప్రదాయ‌క చలనచిత్ర ఆకృతిలో కాకుండా కథ కోసం దీర్ఘ-రూప ఆకృతిని కూడా ర‌చ‌యిత‌ల బృందం అన్వేషిస్తున్నార‌ని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇదంతా చాలా ప్రారంభ దశలో ఉంది. ర‌చ‌న పూర్త‌వ్వ‌డానికే మరో 6 నుండి 8 నెలల సమయం పడుతుంది. రాజ్ కుమార్ రావు ఇత‌ర కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ఇటీవల అనుభవ్ సిన్హా చిత్రం 'భీద్'లో నటించారు.

ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్- పంకజ్ కపూర్- దియా మీర్జా త‌దిత‌రులు నటించారు. COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి 2020లో విధించిన లాక్ డౌన్ కారణంగా ఒక వర్గం ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను భీద్ లో చూపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని అనుభవ్ సిన్హా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్ లో చిత్రీకరించారు.