Begin typing your search above and press return to search.
వెబ్ సిరీస్ కోసం బరువు పెంచేశాడు
By: Tupaki Desk | 6 July 2017 6:08 AM GMTబాలీవుడ్ నటుడు రాజకుమార్ రావు ఈ పేరు వినగానే అందరి మనసులో అనుకునేది ఒకటే.. 'కెసిఆర్'పై తీసే బయోపిక్ గుర్తొస్తుంది. మనోడు తెలుగులో తీయబోయే ఆ సినిమాలో కెసిఆర్ రోల్ చేయబోతున్నాడు అన్నప్పటినుండీ ఇక్కడ కూడా పాపులర్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో షాహిద్ సినిమా నుండి నిన్న రాబ్తా సినిమా వరకు రాజ్ కుమార్ ఏమి చేసినా ప్రేక్షకులును మెప్పించాడు. అయితే ఇప్పుడు మనోడ్ని చూస్తే నేను నమ్మను అనాల్సిందే మీరు.
ఉడాన్ సినిమా డైరెక్టర్ విక్రమాదిత్య మొత్వానే డైరెక్ట్ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ట్రాప్పెడ్’ సినిమా కోసం రాజ్ కుమార్ రావు చాలా సన్నబడి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు మళ్ళీ హాన్సల్ మెహతా డైరెక్ట్ చేయబోతున్న ''బోస్'' అనే వెబ్ సిరీస్ కోసం బాగ బరువు పెరిగాడు. ఇదే వెబ్ సిరీస్లో రాజ్ కుమార్ రావు సగం బట్టబుర్రతో కనిపించనున్నాడు. సుమారుగా 11 కేజి లు పెరిగిన రాజ్ కుమార్ రావు ఫోటోని చూసి అందరూ షాక్ అయ్యారు. ట్రాప్పెడ్ సినిమాలో బక్క చిక్కి.. బెహెన్ హోగి తేరి సినిమాలో కండలు పెంచి ఫిట్ గా కనిపించి.. మళ్ళీ ఇప్పుడు బోస్ వెబ్ సిరీస్ కోసం ఇలా పెరిగి ఆ మార్పును స్పష్టంగా తెలియపరచడానికి ఒక పోటో ను షేర్ చేశాడీ హీరో.
“నేను సాధరణంగా తిన్నదాన్ని కన్నా పది రేట్లు ఎక్కువగా తిన్నాను. ఒక పాత్ర కోసం పనిచేసేటప్పుడు నాకు చాల సంతృప్తి దక్కుతుంది. తెర పైన ఆ పాత్రను ఎంత బాగ చేస్తే పాత్ర మరింత గొప్పగా కనిపిస్తుందో ఆలోచించి దాన్ని కోసం వంద శాతం శ్రామిస్తాను అని చెప్పాడు” అంటున్నాడు రాజ్ కుమార్ రావ్. ఈ మధ్య కాలంలో దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ ఇలా పొట్టను పెంచేసినప్పటి నుండి.. చాలామంది హీరోలు ఇనస్పయిర్ అయినట్లున్నారే.