Begin typing your search above and press return to search.
కపిల్ దేవ్ బయోపిక్ నే కోల్పోయ్యాడు!
By: Tupaki Desk | 10 Oct 2018 1:30 AM GMTబాలీవుడ్ లో మీ-టూ హ్యాష్ ట్యాగ్ ప్రకంపనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా తనూశ్రీ దత్తా తెగువ అనంతరం ఒక్కో భామ నేరుగా టీవీ చానెళ్ల లైవ్ లోకి వచ్చి తమకు జరిగిన అన్యాయాల్ని - వేధింపుల ఘట్టాల్ని బయటికే చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు కథానాయికలు ఎవరెవరి వల్ల తాము వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందో పేర్లు బయటపెట్టేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వికాస్ బాల్ పేరు ఈ వివాదంలో ప్రముఖంగా హైలైట్ అయ్యింది. క్వీన్ కంగన అతడి వేధింపుల తీరును తూర్పారబట్టింది. ఆ క్రమంలోనే కంగన కోస్టార్లు ధైర్యంగా ముందుకు వచ్చి వేధింపుల రాక్షసత్వంపై బయటపడ్డారు.
దీంతో ఏకంగా స్టార్ హీరో హృతిక్ రోషన్ అంతటివాడే అలాంటి తప్పుడు పని చేసిన వారికి తాను ఎప్పటికీ చోటివ్వను అనాల్సొచ్చింది. ఇకపోతే వికాస్ బాల్ పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి - వెనక గొయ్యి! అన్న చందంగా తయారైంది. ఓవైపు హృతిక్‌తో తీస్తున్న `సూపర్ 30` నుంచి అతడిని తొలగించారన్న వార్తతో ఏం జరుగుతోంది? అన్న సందేహాలు కలిగాయి. ఇక ఈ గొడవ సద్ధుమణుగుతోంది అనుకుంటుండగానే మరో బాంబ్ లాంటి వార్త.
వికాస్ బాల్ విషయంలో తనతో కలిసి `సూపర్ 30` సినిమాకి పని చేస్తున్న యువనటుడు రాజ్ కుమార్ రావ్ సైతం వ్యతిరేకించాడు. ``మహిళలకు అందరూ అండగా ఉండాలని - తప్పు చేసింది ఎవరైనా శిక్ష పడాల్సిందే``నని వ్యాఖ్యానించారు. ఇక రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న `83` చిత్రం నుంచి వికాస్ బాల్ తప్పుకోవాల్సొచ్చింది. ఈ విషయంపై పాంథమ్ ఫిలింస్ అధినేతలు విక్రమాధిత్య మోత్వానీ - మధు మంతెన స్వయంగా ఓ ప్రకటన చేశారు. 83 చిత్రంతో వికాస్ బాల్ కి ఏ సంబంధం లేదు. అతడితో తెగ తెంపులు చేసుకున్నామని తెలిపారు. గత ఏడాది గోవాలో జరిగిన ఓ పార్టీలో వికాస్ బాల్‌పై పాంథమ్ ఫిలింస్ కంపెనీ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. అతడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్నది ఆ మహిళ ఆరోపణ. ఇకపోతే 83 చిత్రం లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితకథతో తెరకెక్కుతోంది. 1983లో ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కపిల్ ప్రావీణ్యం - కెప్టెన్సీపై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇలాంటి క్రేజీ మూవీని వికాస్ కోల్పోవడం దురదృష్టం.