Begin typing your search above and press return to search.
ఇండియన్ ప్రీమియర్స్ కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్
By: Tupaki Desk | 12 March 2022 12:34 PM GMTదర్శకధీరుడు జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`. `బాహుబలి` వంటి చరిత్ర సృష్టించిన సినిమా తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన ఈమూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచానాలున్నాయి. ఈ చారిత్రక చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
గత కొంత కాలంగా వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ ..అల్లూరి సీతారామరాజు గానూ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగానూ ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల్లో నటించడంతో ఈ చిత్రం ఎలా వుండబోతోందా?
ఆయా పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎలా నటించారనే ఆసక్తి సినిమాపై మరింత క్రేజ్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీ ప్రీమియర్స్ మార్చి 24న జరగబోతున్న విషయం తెలిసిందే.
అయితే `బాహుబలి` తరహాలోనే ఈ మూవీ ప్రీమియర్స్ ని ఏర్పాటు చేయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్టుగా మేకర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్లకి వెల్లడించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇండియాలో రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్ మొదలవుతుంటాయి. కానీ ఈ మూవీ కోసం సాయంత్రం 6 గంటలకు ఒకటి, రాత్రి 9 గంటలకు ఒక ప్రీమియర్ షోని ఏర్పాటు చేయాలని రాజమౌళి ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసినట్టుగా చెబుతున్నారు.
అంటే రాజమౌళి తాజా ప్లాన్ ప్రకారం `ఆర్ ఆర్ ఆర్` ప్రీమియర్స్ కోసం బ్యాక్ టు బ్యాక్ రెండు షోలని ఏర్పాటు చేయబోతున్నారట. ఇదే పద్దతి స్టేట్ మొత్తం వుండాలని డిస్ట్రిబ్యూటర్లకు, మేకర్స్ కి ఇప్సటికే రాజమౌళి చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ మూవీ న్యూ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు.
అంతే కాకుండా సోమవారం నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడప్ చేయబోతున్నారు. ఈ రోజున `ఎత్తర జెండా.. అంటూ సాగే లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నామంటూ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.