Begin typing your search above and press return to search.

#RRR : చెప్పకనే ఆ ముగ్గురి రెమ్యూనరేషన్‌ చెప్పేశారు

By:  Tupaki Desk   |   21 March 2022 1:30 AM GMT
#RRR : చెప్పకనే ఆ ముగ్గురి రెమ్యూనరేషన్‌ చెప్పేశారు
X
మార్చి 25వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా హంగామా అంతా ఇంతా లేదు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచేస్తున్నాయి. రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్ముతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా బాహుబలి 2 వసూళ్లను బీట్ చేస్తుందా లేదా అనేదే..!

ఈ సినిమా ను 550 కోట్ల బడ్జెట్‌ తో రూపొందించినట్లుగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చాడు. కరోనా వల్ల ఈ సినిమా మేకింగ్‌ కాస్ట్‌ దాదాపుగా వంద కోట్లకు పైగా పెరిగిందని ఆ ఇంటర్వ్యూలో అనధికారికంగా చెప్పుకొచ్చాడు.

ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కు అవ్వని ఖర్చు ఈ సినిమాకు అయ్యింది. అలాగే ఈ సినిమా వసూళ్లు కూడా ఖచ్చితంగా అలాగే ఉంటాయనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇండియన్‌ సినిమా సాధించని వసూళ్లను ఈ సినిమా సాధించడం ఖాయం.

ఈ సమయంలో సినిమా లో నటించిన హీరోల పారితోషికం గురించి చర్చ జరుగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్ల పెంపు కోసం నిర్మాత దానయ్య లెటర్‌ రాశాడు. అందులో ఈ సినిమాకు స్టార్స్ రెమ్యూనరేషన్ కాకుండా 336 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నాడు. దాంతో ఇద్దరు హీరోలు మరియు జక్కన్న పారితోషికం ఎంత అనే విషయం పై సోషల్‌ మీడియాలో లెక్కలు వేస్తున్నారు.

మొత్తం బడ్జెట్‌ 550 కోట్లుగా చెబుతున్నారు. అందులో మేకింగ్‌ కు 336 కోట్ల రూపాయలు పోయింది. అంటే పారితోషికాలుగా 214 కోట్ల వరకు ఇచ్చారు. ఈ మొత్తం లో ఖచ్చితంగా దర్శకుడు రాజమౌళికి మెజార్టీ వాట వెళ్లి ఉంటుంది అనడంలో సందేహం లేదు. కనుక ఆయన 80 నుండి 90 కోట్ల రూపాయల పారితోషికం ను తీసుకుని ఉంటాడు. ఇక ఇద్దరు హీరోలు ఒక్కొక్కరు 60 నుండి 65 కోట్ల పారితోషికం అందుకుని ఉంటారు.

ఇక 8 నుండి 10 కోట్ల రూపాయలను ఆలియా భట్‌ కు ఇచ్చి ఉంటారు అనేది ఊహ. సినీ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు ఈ విషయంపై తెగ చర్చిస్తున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా చెప్పకుండానే పారితోషికాల విషయంలో కాస్త అటు ఇటుగా ఇలా క్లారిటీ ఇచ్చారంటూ టాక్‌ వినిపిస్తుంది.