Begin typing your search above and press return to search.

క‌బాలి వ‌ర్సెస్‌ డిక్టేట‌ర్.. అదరహో

By:  Tupaki Desk   |   16 Sep 2015 5:09 PM GMT
క‌బాలి వ‌ర్సెస్‌ డిక్టేట‌ర్.. అదరహో
X
ఈరోజు రెండు ఫ‌స్ట్‌ లుక్‌ లు .. టాలీవుడ్‌ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న క‌బాలి ఫ‌స్ట్‌ లుక్‌. బాల‌య్య‌బాబు హీరోగా న‌టిస్తున్న డిక్టేట‌ర్ ఫ‌స్ట్‌ లుక్ రిలీజ‌య్యాయి. ఈ రెండు పోస్ట‌ర్ ల‌పై అభిమానుల్లో ఓ రేంజులో డిష్క‌స‌న్స్ సాగాయి. ఈ రెండిటిలో ఏ లుక్ బావుంది? ఏది పైచేయి సాధించింది? అన్న‌ది తేల్చ‌లేని పరిస్థితి. వేటిక‌వే.. ప్ర‌త్యేక‌త ఉన్న పోస్ట‌ర్ లు ఇవి. ఫ‌స్ట్ లుక్‌ లో ర‌జ‌నీ స్ట‌యిల్‌, బాల‌య్య ఫోజు సింప్లీ సూప‌ర్భ్‌.

కౌలాలంపూర్ పెట్రోనాస్ ట‌వ‌ర్స్ వ్యూలో ర‌జ‌నీ ఫోజులిచ్చిన తీరు మైండ్ బ్లోవింగ్‌. పండిన త‌ల‌వెంట్రుక‌లు , నెరిసిన గ‌డ్డం .. ఆ సూటు బూటు ... ర‌జ‌నీ కూచున్న తీరు మైండ్ బ్లోవింగ్ .. మ‌ర‌సారి బాషాని త‌ల‌పిస్తున్నాడు. ఆ రెబ‌లిజం యాటిట్యూడ్ ర‌జ‌నీలో క‌నిపిస్తోంది. దెబ్బ తిన్న పులి పంజా విసిరేందుకు సిద్ధంగా ఉందా? ఎందుకంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు? అన్న ప్ర‌శ్న త‌లెత్త‌క మాన‌దు. అస‌లే త‌మిళ‌నాడు మాఫియా డాన్ క‌బాలీశ్వ‌రుని క‌థ‌లో న‌టిస్తున్నాడు. ఇలాంటి క్యారెక్ట‌ర్ లు ర‌జ‌నీకి కొట్టిన పిండి. ద‌ళ‌ప‌తిలో ఓ చిన్న సైజు రౌడీగా, మ‌న‌సున్న గూండాగా క‌నిపించాడు. ఆ త‌ర్వాత భాషాలోనూ ప్ర‌జ‌ల మ‌న‌సు దోచే డాన్‌ గా క‌నిపించాడు. స్నేహం కోసం ప్రాణ‌మిచ్చే డాన్‌ గా క‌నిపించాడు. ఇప్పుడు క‌బాలిలోనూ ప్ర‌జ‌ల కోసం రాబిన్‌ హుడ్‌ గా మారిన హీరోయిజం చూపిస్తున్నాడు.

బాల‌య్య డిక్టేట‌ర్ లుక్ కూడా మైండ్ బ్లోయింగ్‌. డిక్టేట‌ర్ అన్న టైటిల్‌ కి త‌గ్గ‌ట్టే బాల‌య్య లుక్ వెరీ రిచ్‌ గా ఉంది. అల్ర్టా మోడ్ర‌న్ లుక్ అద‌ర‌గొట్టేసింది. కాలు మీద కాలు .. చేతిలో సిగార్ .. క‌ళ్ల‌కు రెబాన్ .. త‌న‌కి మాత్ర‌మే సూట‌య్యే షూటింగ్ స్ట‌యిల్‌.. రెక్లెస్ యాటిట్యూడ్ డిక్టేట‌ర్ లుక్‌ కి వ‌న్నె తెచ్చింది. ఖ‌రీదైన వాడు.. కాస్ట్‌ లీ బాబు ఎలా ఉంటాడో ఈ డిక్టేట‌ర్‌ ని చూస్తే తెలిసిపోతుంది. ఈ లుక్ చూస్తే .. ఫ్యూచ‌ర్‌ లో ఆంధ్రా రాజ‌కీయాల్ని కుదిపేసే డిక్టేట‌ర్ అవుతాడేమో అనిపిస్తోంది. ఇద్ద‌రు స్టార్లు .. రెండు ఫ‌స్ట్ లుక్‌ లు. అద‌ర‌హో.. !