Begin typing your search above and press return to search.
మోడీ చెప్పాడనే ‘2.0’ సినిమా అలా..
By: Tupaki Desk | 4 April 2017 2:02 PM GMTగత కొన్నేళ్లలో చిన్నా చితకా సినిమాలకు కూడా ఫారిన్లో షూటింగ్ చేయడం అన్నది కామనైపోయింది. ఒకప్పుడు పాటల కోసమే విదేశాలకు వెళ్లే సినీ బృందాలు.. ఈ మధ్య సినిమాలు సినిమాల్నే విదేశాల్లో కానిచ్చేస్తున్నాయి. అలాంటిది ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ మాత్రం పూర్తిగా ఇండియాలోనే తెరకెక్కుతుండటం విశేషమే. రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమా కోసం ఒక్క షెడ్యూల్ కూడా ఫారిన్లో ప్లాన్ చేయలేదట. అంతర్జాతీయ టెక్నీషియన్లను రప్పించుకుని ఇండియాలోనే మొత్తం షూటింగ్ కానిస్తున్నారు. దీనికంతటికి కారణం ప్రధాన నరేంద్ర మోడీయేనని వెల్లడైంది.
మోడీ ప్రధాని అయ్యాక మేకిన్ ఇండియా ప్రోగ్రాం మొదలుపెట్టి.. ఏం చేయాలన్నా భారతీయ సాంకేతికతనే ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ‘2.0’ షూటింగ్ అంతా కూడా ఇండియాలోనే చేయాలని.. ఇక్కడి వనరుల్నే ఉపయోగించుకోవాలని రజినిని స్వయంగా కోరారట. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన రాజు మహాలింగం ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. ‘‘మా గ్రూప్ అంతా లండన్ కు చెందినవాళ్లమే. కానీ ‘2.0’ సినిమాను మాత్రం ఇండియాలోనే చిత్రీకరించాం. మోడీ గారే రజనీ గారికి సినిమా భారత్‌లో చిత్రీకరించాలని సలహా ఇచ్చారట. సినిమా క్లైమాక్స్ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చిత్రీకరించాం మిగతా సినిమాలో ఎక్కువ శాతం చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో చిత్రీకరించాం’’ అని రాజు మహాలింగం తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/