Begin typing your search above and press return to search.
అందుకోసం సూపర్ స్టార్ ఏం చేస్తున్నాడో తెలుసా..?
By: Tupaki Desk | 28 Jun 2020 2:30 AM GMTకరోనా.. ఇపుడు ఈ మహమ్మారి పేరు వింటేనే ప్రపంచం మొత్తం గజగజ వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దేశా విదేశాలన్నింటిని చుట్టేస్తోంది. అంతేగాక ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది. దీంతో అప్రమత్తమైన జనం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మన దేశంలో లాక్‌డౌన్ సడలింపులు అమలులో ఉన్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు బీదా.. గొప్ప.. ఆడా.. మగా తేడా లేకుండా అందరు ఆసుపత్రి పాలవుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు అన్నీ పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమలు కూడా స్థంభించిపోయాయి. ఈ వైరస్ ధాటికి సమస్తం షూటింగ్స్ సహా సమస్తం బంద్ అయ్యాయి. ప్రభుత్వాలు అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ ఎఫెక్ట్ కారణంగా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇంటికే పరిమితమయ్యారు.
అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా లాక్ డౌన్లో ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్నాడు. దాదాపు మూడు నెలల నుండి సూపర్ స్టార్ ఎలాంటి సినిమాలు.. షూటింగ్స్ లేక తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ప్రస్తుతం అన్నతే సినిమాలో నటిస్తున్నాడు రజినీ. ఆయన ఇప్పుడైతే చెన్నై శివారులోని కేలంబాక్కం ఫామ్ హౌస్ లో ఉంటున్నారట. ఇక ఖాళీ సమయం దొరికిందని రజినీ ఓటిటిలో సినిమాలు.. వెబ్ సిరీస్లు చూస్తున్నాడట. అంతేగాక వార్తలు చూస్తూ.. పుస్తకాలు చదువుతున్నాడట. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ లోకి ఎవరినీ రానివ్వడం లేదట. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తున్నాడు. ఇక కేవలం తమ ఫామ్ హౌస్ లో పండిన పండ్లు, కూరగాయలు మాత్రమే ఉపయోగిస్తున్నాడట రజినీ. అలా లాక్ డౌన్ సమయాన్ని గడుపుతున్నట్లు సమాచారం.