Begin typing your search above and press return to search.
తీహార్ జైలుకు బాలీవుడ్ కమెడియన్
By: Tupaki Desk | 1 Dec 2018 4:07 AM GMTరాజ్ పాల్ యాదవ్.. బాలీవుడ్ సినిములు చూసేవాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అసవరం లేని పేరు. వందల కొద్దీ హిందీ సినిమాల్లో నటించాడతను. తెలుగులోనూ ‘కిక్-2’ సినిమాలో నటించాడు రాజ్ పాల్. ఓ వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పును చెల్లించనందుకు అతను జైలు పాలయ్యాడు. ఢిల్లీకి చెందిన అగర్వాల్ అనే వ్యాపారవేత్త దగ్గర రూ.5 కోట్ల అప్పు తీసుకుని.. తిరిగి చెల్లించనందుకు కోర్టు రాజ్ పాల్ కు కోర్టు ఈ శిక్ష విధించింది. విచారణ అనంతరం రాజ్ పాల్ యాదవ్ ను పోలీస్ కస్టడికి అప్పగిస్తూ జస్టిస్ రాజీవ్ సాహాయ్ ఎండ్లా తీర్పునిచ్చారు. రాజ్ పాల్ యాదవ్ ను తీహార్ జైలులో ఉంచాలని తీర్పులో పేర్కొన్నారు.
రాజ్ పాల్ యాదవ్ మురళీ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ అధినేత అయిన అగర్వాల్ దగ్గర కొన్నేళ్ల కిందట ఐదు కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బుతో 2012లో ‘ఆట పాట లపాట’ అనే సినిమాను నిర్మించాడు. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం దారుణ ఫలితాన్నందుకుంది. దీంతో రాజ్ పాల్ అప్పుల పాలయ్యాడు. తన అప్పు చెల్లించలేకపోవడంతో అగర్వాల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రాజ్ పాల్ పలుమార్లు సమన్లు అందుకొన్నాడు. ముందు అతడికి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఐతే తర్వాత కోర్టు ఆదేశం మేరకు రూ.1.58 కోట్లు చెల్లించి.. మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. కానీ మిగిలిన అప్పును తిరిగి చెల్లించలేకపోయాడు. దాంతో విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. రాజ్‌పాల్ జైలుకు వెల్లడం మొదటిసారి కాదు. 2013లో తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించిన రాజ్ పాల్ యాదవ్ కు కోర్టు జైలు శిక్ష విధించింది. మూడు రోజులు తీహార్ జైలులో గడిపాడు. ఐతే తర్వాత కోర్టు శిక్షను రద్దు చేసింది.