Begin typing your search above and press return to search.
దీపికను చంపేయడానికి ఐదు కోట్లిస్తాం
By: Tupaki Desk | 17 Nov 2017 5:59 PM GMTబాలీవుడ్ ’పద్మావతి‘ సినిమా పరిస్థితి ఏమిటో అస్సలు అర్థం కావడం లేదు. ఓ వైపు ఆందోళన కారులు అస్సలు రిలీజ్ కానివ్వమని శపథం చేస్తున్నారు. మరోవైపు పద్మావతి చిత్ర యూనిట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమాని రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. చారిత్రాత్మక సినిమాలకు మొదట ఇలాంటివి కామన్ ఆ తర్వాత అవే సర్దుకుంటాయి అని అంతా అనుకున్నారు. కానీ వివాదాలు కారుచిచ్చులా పద్మావతి సినిమాని దహించి వేసేలా ఉన్నాయి.
మొన్న కర్ణిసేన సమితి సభ్యులు దీపికా పదుకొనె ముక్కును కోసేస్తామని చెప్పారు. డైరెక్టర్ పై కూడా మరోసారి చేయి చేసుకుంటామని చెప్పారు. ఇక రీసెంట్ గా మరోసారి వారు ఎవరు ఊహించని విధంగా డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి ఠాకూర్ లీడర్ అభిషేక్ సోమ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతే కాకుండా ఇండియాలో ఉన్న ఏ క్షత్రియ కులానికి చెందిన ఏ యువకుడైనా సరే దీపికా పదుకొనేని చంపేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన పద్మావతి సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కానివ్వమని కూడా చెబుతున్నారు. 15వ శతాబ్దానికి చెందిన రాజ్ పుత్ మహారాణి జీవిత ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. డిసెంబర్ 1న రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఒక్క సెన్సార్ పనులు పూర్తి కావాల్సి ఉంది. మరో 10 రోజుల్లో ఆ వర్క్ కూడా పూర్తవుతుంది. ఏది ఏమైనా సెన్సార్ పూర్తయిన తర్వాత ఈ సినిమాపై ఓ క్లారిటీ రావాలి.