Begin typing your search above and press return to search.
షాకిచ్చిన జీవిత రాజశేఖర్ కూతురు
By: Tupaki Desk | 9 July 2018 8:51 AM GMTతెలుగు తెరపై హీరోలు - వారి వారసులు నటనారంగంలోకి రావడం సహజంగానే జరుగుతోంది. కానీ కథనాయకులు మాత్రం రావడం లేదు. బాలీవుడ్ లో సినీ ప్రముఖుల కూతుళ్లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. తెలుగునాట మాత్రం ప్రెస్టేజ్ ఇష్యూలో రావడం లేదు. మంచు లక్ష్మీ - కొణిదెల నిహారికలు హీరోయిన్లుగా వచ్చి ఔరా అనిపించారు. ఇక వీరిదారిలోనే తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అడవి శేష్ సరసన ‘2 స్టేట్స్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. ఆమెకు మరిన్ని అవకాశాలు అందుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
అయితే తాజాగా శివానికి అవకాశం వేరే భాషల్లో రావడం విశేషం. తమిళంలో విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రానికి శివానీని కథనాయికగా ఎంచుకున్నట్టు ఇటీవలే వెల్లడైంది. తాజాగా మరో సినిమా అవకాశం కూడా వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు హీరోగా నటించే కొత్త సినిమాలో శివానిని కథనాయికగా తీసుకున్నారట.. చిన్నతనంలోనే నటుడిగా పరిచయమై.. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా దర్శకత్వ బాధ్యతలోకి వెళ్లిపోయిన మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్.. ఈ మధ్యే నటన వైపు అడుగులేశాడు. ఓ యువ దర్శకుడితో చేయబోయే సినిమాలో శివానీ హీరోయిన్ గా కన్ఫం అయ్యిందట.
ఇలా తొలి సినిమా విడుదల కాకముందే శివాని త్రిభాష కథనాయిక కాబోతోందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కొన్నాళ్ల క్రితమే నటనతో పాటు డ్యాన్స్ ఇతర విషయాల్లో శిక్షణ తీసుకున్న శివాని..తనకొచ్చిన అవకాశాల్లోంచి జాగ్రత్తగా ‘2స్టేట్స్’ ను అరంగేట్ర చిత్రంగా ఎంచుకుంది. మరి శివానీ వెండితెరపై ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి మరి.