Begin typing your search above and press return to search.
#MeToo రంగు పులిమి అబద్ధాలు చెబితే ఉద్యమానికే ఎసరు!
By: Tupaki Desk | 25 Sep 2020 2:30 AM GMTదర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాక యువకథానాయిక రాజ్‌శ్రీ దేశ్ పాండే ఒక బహిరంగ లేఖ రాశారు. దర్శకుడు తప్పు చేస్తే ఆధారాలుంటే వ్యవస్థ ప్రకారం శిక్ష తప్పదని.. అయితే #MeToo రంగు పులిమి అబద్ధాలు చెప్పడం వల్ల ఉద్యమం నాశనం అవుతుందని క్లాస్ తీస్కుంది.
అయితే పాయల్ ఆరోపణల్ని అనురాగ్ నిరాధారమైనవి అంటూ ఖండించిన సంగతి తెలిసిందే. అయితే కశ్యప్ తో కలిసి పనిచేసిన దేశ్ పాండే ఇరువైపులా మాట్లాడడం ఆసక్తికరం. పాయల్ ఘోష్ ఏం చెప్పబోతోందో అర్థం చేసుకోవాలని.. వినాలని ఆమె వరుస ట్వీట్ల లో రాశారు. ``వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన మనలో ప్రతి ఒక్కరికీ స్వరం (గళం) ప్రదర్శించడానికి మీటూ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైందని మనందరికీ తెలుసు. ప్రపంచంలోని ప్రతి అణచివేయబడిన స్వరానికి అలాంటి కదలిక అవసరమని నేను భావిస్తున్నాను``
అనురాగ్ ఏదో తప్పు చేసి ఉంటే దొరుకుతాడు. వ్యవస్థ శిక్షిస్తుంది. కానీ ఆరోపణ అబద్ధమైతే మీటూ మాస్ ఉద్యమం వీగిపోవటం ప్రారంభమవుతుంది. దాని లక్ష్యాన్ని కోల్పోతుంది`` అని ఆమె ట్వీట్ చేసింది. ఒక తప్పుడు కథనం `చాలా ఇతర స్వరాలను దెబ్బతీస్తుందని` భయపడ్డానని ఆమె చెప్పారు.
ఈ సంఘటన 2014-2015లో జరిగిందని ఓ వీడియోలో ఘోష్ పేర్కొన్నారు.
ఆమె వీడియో చూసి ప్రపంచం `తీర్పు` ఇస్తున్నందువల్ల కాదు కానీ ఆమె తన ప్రయాణాన్ని తెలుసుకోవాలనుకుంటున్నందున పాయల్ ఘోష్ స్వరం కూడా వినాలని కోరుకుంటున్నానని దేశ్ పాండే అన్నారు. తన వాదనకు మద్దతుగా ఘోష్ ఇతర మహిళల పేరును ఎందుకు ఉపయోగించటానికి `వెనుకాడలేదు` అన్నది కూడా అర్థం చేసుకోవాలని అన్నారు.
``ఇది అవమానకరమైనది .. పరువు నష్టం కలిగించేది అని మీరు అనుకోలేదా? ఆరు సంవత్సరాలుగా మీరు ఈ అనుభవాన్ని ఎలా ఎదుర్కున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. వేధింపులకు గురికావడం ఎంత కష్టమో నాకు తెలుసు. చాలా బాధాకరమైన సంఘటనను మరచిపోవడం అంత సులభం కాదు`` అన్నారు. తన ప్రశ్నలకు ఘోష్ వెంటనే సమాధానం చెప్పగలదని తాను ఆశిస్తున్నానని దేశ్ పాండే చెప్పారు. తాను భారతీయ చిత్ర పరిశ్రమను ప్రేమిస్తున్నానని దాని లోపాలను తెలుసునని పాండే తన లేఖను ముగించారు. “ఆ లోపాలను శుభ్రపరచడం మన ఇష్టం, కాని మనం మనస్సాక్షిగా చేసేలా చూసుకోవాలి. నిజాయితీగా.. బలంగా ఉండటానికి దేవుడు మనకు బలాన్ని ఇస్తారు`` అని అన్నారు.