Begin typing your search above and press return to search.
'బంగారం'గాడు ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు: రాజ్ తరుణ్
By: Tupaki Desk | 24 Nov 2021 11:30 AM GMTశ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' సినిమా చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మించిన ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి కథానాయికగా కాశిష్ పరిచయమవుతోంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జల్సా రాయుడిగా .. బుద్ధిగా చిన్నపాటి ఉద్యోగం చేసుకునేవాడిగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ కనిపించడంతో కంటెంట్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి రాజ్ తరుణ్ మాట్లాడాడు. " ఈ కథ వినగానే నాకు బాగా నచ్చింది. 'బంగారం'గాడి పాత్ర నాకు బాగా కనెక్ట్ అయింది. ఈ పాత్ర చేయడం వలన, కామెడీ చేయడంలో నేను బాగా ప్రాక్టీస్ చేసినట్టుగా అయింది. గ్రామీణ నేపథ్యం .. కామెడీ .. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్ ఈ సినిమాలో ప్రధానంగా కనిపిస్తాయి. అవి ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. కథ ద్వారా సందేశం ఇచ్చే ప్రయత్నాలేమీ చేయలేదు .. నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా సాగుతుందంతే.
అన్నపూర్ణ .. నా హోమ్ బ్యానర్ వంటిది. ఇంతకుముందు ఈ బ్యానర్ నాకు మూడు హిట్స్ ఇచ్చింది. ఆ సినిమాల్లో చేసిన పాత్రలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అలాగే ఈ సారి కూడా నా కెరియర్ గ్రాఫ్ ను పెంచే సినిమాను ఇవ్వనుంది. ఈ సినిమా ద్వారా కాశిష్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. తను చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. తన రోల్ ను చాలా బాగా చేసింది కూడా. డైలాగ్స్ ను చాలా పెర్ఫెక్ట్ గా చెప్పింది .. తనకి మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సినిమా మా ఇద్దరికీ కూడా మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకం ఉంది. ఈ సారి హిట్ కొట్టడం ఖాయమనిపిస్తోంది.
ఇంతవరకూ నేను 14 సినిమాలు చేశాను. వాటిలో 4 సినిమాలు చాలా పెద్ద హిట్లు కొట్టాయి. నేను సినిమాలు చేయడానికి ముందు ఎప్పుడూ కూడా హైదరాబాద్ రాలేదు. ఇప్పుడు ఒక హీరోగా ఇండస్ట్రీలోని వ్యక్తిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఇంకా చాలా సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. అందుకు అన్నీ కలిసి రావాలి.
ఈ సినిమా తరువాత నా నుంచి 'స్టాండప్ రాహుల్' రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక ఆ తరువాత సినిమాగా మాస్ మహారాజ్ సెట్స్ పైకి వెళ్లనుంది. వెబ్ సిరీస్ లు కూడా చేయాలనుంది .. ఒక భారీ ఆఫర్ కూడా వచ్చింది కానీ డేట్స్ కుదరలేదు" అని చెప్పుకొచ్చాడు.