Begin typing your search above and press return to search.
యాక్షన్ పక్కనెట్టి రొమన్స్ తీస్తాడట
By: Tupaki Desk | 21 Nov 2015 9:30 AM GMTకహోనా ప్యార్ హై - కోయి మిల్ గయా - క్రిష్ - క్రిష్ 3 .. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినిమాలు ఇవన్నీ. ఈ భారీ బడ్జెట్ సినిమాలన్నీ రాకేష్ రోషన్ స్వయంగా దర్శకత్వం వహించి సొంత ప్రొడక్షన్ లో నిర్మించినవి. ప్రస్తుతం హృతిక్ హీరోగా క్రిస్ 4 సినిమాకి సన్నాహాలు సాగుతున్నాయి. ప్రీప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. అయితే ఈ సినిమాకి హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకనిర్మాత కాదు. కేవలం సలహా దారు మాత్రమే.
అయితే రాకేష్ రోషన్ హృతిక్ హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇదే విషయాన్ని రాకేష్ నే ప్రశ్నిస్తే చాలా ఇంట్రెస్టింగ్ సంగతుల్ని చెప్పారాయన. అవును హృతిక్ రోషన్ లేనిదే నా సినిమా లేదు. ఈసారి ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నా. అయితే ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం టూ ఎర్లీ అనిపించుకుంటుంది. ఇంకా వర్కింగ్ లోనే ఉన్నాం.. అని అన్నాడు. అసలు మీ అబ్బాయి కాకుండా వేరే ఎవరినీ డైరెక్ట్ చేయరా? అన్న ప్రశ్నకు ఛాన్సేలేదని రాకేష్ రోషన్ అన్నారు.
ప్రస్తుతం హృతిక్.. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో మొహంజోదారో అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. దీంతో పాటు ధూమ్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇవన్నీ అయ్యాక తండ్రి రాకేష్ రోషన్ తో సినిమా చేస్తాడు. తండ్రి కొడుకుల అనుబంధానికి ప్రతీక హృతిక్ - రాకేష్ రోషన్.