Begin typing your search above and press return to search.
అబ్బే.. మెగాస్టార్ వేలు పెట్టలేదండీ
By: Tupaki Desk | 28 May 2018 11:30 PM GMTమెగా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ రాబోతున్న హీరో కళ్యాణ్ దేవ్. మామ విజేత టైటిల్ తో రాబోతున్న అల్లుడు పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది. మెగా అభిమానులు కూడా కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలుకుతున్నారు. సాయి కొర్రపాటి వారాహి ప్రొడక్షన్ లో రాకేష్ శశి సినిమాను డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ఓ విషయాన్ని చెప్పాడు.
సాధారణంగా మెగా ఫ్యామిలి తరపు నుంచి ఏ హీరో పరిచయమైనా కూడా ముందుగా మెగా స్టార్ చిరంజీవి నిర్ణయం ఫైనల్ కానిదే సినిమా మొదలవ్వదు. అదే విధంగా మొదట ఆయన కథ వినగానే దాన్ని ఫైనల్ చేయడం ఆ తరువాత ఏమైనా తప్పులు ఉంటే సెట్ చేసుకొమ్మని చెప్పడం మాములే. కానీ విజేత స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ కొంచెం కూడా వేలు పెట్టలేదట. మొదట కథ చెప్పగానే ఆయన ఒప్పేసుకున్నట్లు రాకేష్ శశి వివరించాడు.
"మొదట సీనియర్ రైటర్ సత్యా నంద్ గారితో ఈ లైన్ గురించి చర్చించినప్పుడు కళ్యాణ్ దేవ్ తో చేస్తే బావుంటుందని ఆయనతో పరిచయం చేయించారు. కళ్యాణ్ కి కూడా నచ్చడంతో మామయ్యతో మాట్లాడమని చెప్పారు. సాయి కొర్రపాటి మాతో జాయిన్ అయ్యి మెగాస్టార్ తో మాట్లాడారు. దాదాపు గంటన్నర సేపు కథ చెప్పగానే మెగాస్టార్ పెద్దగా మార్పులు లేకుండా సినిమా తెరకెక్కించమని చెప్పారు. కేవలం తన ఐడియాలను మాత్రమే ఇచ్చారు" కథలో మార్పుల గురించి చెప్పలేదని రాకేష్ వివరించాడు.