Begin typing your search above and press return to search.
రియల్ స్టార్ సినిమాకు నో చెప్పిన సూపర్ స్టార్స్
By: Tupaki Desk | 31 July 2020 4:30 AM GMTచంద్రుడిపై కాలు పెట్టిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో గత రెండు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్స్ కోసం సూపర్ స్టార్స్ ను సంప్రదించారు. మొదట ఇలాంటి ప్రాజెక్ట్ లకు మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ అయితే బాగుంటుందని భావించారు. కాని కొన్ని కారణాలు చెప్పి ఆయన సినిమాను తప్పించుకున్నాడు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ పేరు వినిపించింది.
షారుఖ్ ఖాన్ తో రాకేశ్ శర్మ మూవీ పట్టాలెక్కినట్లే అంటూ ప్రచారం జరిగింది. ఆయన కూడా రియల్ హీరో సినిమాను చేయబోతున్నట్లుగా ఒకటి రెండు సందర్బాల్లో చెప్పాడు. దాదాపు ఏడాది పాటు షారుఖ్ ఖాన్ పేరు వినిపించింది. చివరకు ఆయన కూడా ఆసక్తి చూపక పోవడంతో యంగ్ హీరో రణ్ వీర్ సింగ్.. షాహిద్ కపూర్ ల పేర్లు కూడా వినిపించాయి. కాని వారెవ్వరు ఈ రియల్ హీరో బయోపిక్ లో చేయడం లేదట. ఈ సినిమాను చేయబోతున్న హీరో ఎవరు అనేది క్లారిటీ వచ్చేసింది.
దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకుని నటుడిగా మారిన ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాలో రాకేష్ శర్మ పాత్రను పోషించబోతున్నాడట. బాగ్ మిల్కా బాగ్ చిత్రంతో ఫర్హాన్ అక్తర్ మెప్పించాడు. ఆ సినిమాతో నటుడిగా పరిణితి సాధించినట్లుగా అనిపించింది. అందుకే ఈ చిత్రంలో ఆయన్ను తీసుకున్నట్లుగా దర్శకుడు మహేష్ మథాయ్ పేర్కొన్నారు. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయిన ఈ సినిమాను ఈ ఏడాది ఆరంభంలో పట్టాలెక్కించే అవకాశం ఉంది.