Begin typing your search above and press return to search.
అనుష్కకు ఎసరు పెడుతున్న రాఖీ
By: Tupaki Desk | 19 March 2015 7:30 PM GMTవిరాట్ కోహ్లి, అనుష్క శర్మ ప్రేమలో ఉన్న సంగతి కొత్తదేమీ కాదు. సూటిగా చెప్పకపోయినా తామిద్దరూ లవ్‌లో ఉన్న సంగతి చెప్పకనే చెప్పారు కోహ్లి, అనుష్క. కోహ్లి శ్రీలంకపై సెంచరీ చేసిన అనంతరం ఇచ్చిన గాలిముద్దులు ఎవరికో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో నా ప్రేమ గురించి మీకు తెలియందేముందంటూ అనుష్క అన్న మాటల్లో ఆంతర్యమేంటో విడమరిచి చెప్పాల్సిన పనీలేదు. ఊరికే చెట్టాపట్టాలేసుకుని తిరిగేయడం కాకుండా.. ఇద్దరూ పెళ్లి విషయంలో సీరియస్‌గానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు.
ఐతే వీరి ప్రేమ వ్యవహారం ఇలా సాగుతుండగా.. మధ్యలో వచ్చి హంగామా చేస్తోంది రాఖీ సావంత్. విరాట్‌ను తాను కూడా ప్రేమిస్తున్నానని.. తనదే నిజమైన ప్రేమ అని వాదిస్తోందామె. ఇందులో లాజిక్ ఏంటి అని అడిగితే.. ''విరాట్ అంటే నాకు పిచ్చి. అనుష్క ఇప్పటివరకు విరాట్‌పై తన ప్రేమను బహిరంగంగా చెప్పలేదు. విరాట్ కూడా ఆమె ప్రేమను అంగీకరిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. కానీ అతణ్ని ప్రేమిస్తున్నాననంటూ నేను బహిరంగంగా చెబుతున్నా. ఐ లవ్యూ విరాట్'' అని మీడియా ముందు ప్రకటించింది రాఖీ. మరి ఆమె ప్రపోజల్‌కు విరాట్ ఏమని బదులిస్తాడో.. అనుష్క ఎలా స్పందిస్తుందో?