Begin typing your search above and press return to search.

సుశాంత్ పేరిట నక్షత్రం.. వీరాభిమాని ఘననివాళి!!

By:  Tupaki Desk   |   6 July 2020 2:00 PM GMT
సుశాంత్ పేరిట నక్షత్రం.. వీరాభిమాని ఘననివాళి!!
X
యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాన్ని దేశం ఇంకా మరిచిపోలేదు. అతని అకాల మరణానికి దేశవ్యాప్తంగా సంతాపం తెలిపారు అభిమానులు, సినీ ప్రముఖులు. అయితే సుశాంత్ అంతరిక్షం అంటే ఎంత ఆసక్తి కనబరుస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయం అందరికి తెలుసు అంతరిక్షంలో స్ధలం కలిగిన ఏకైక హీరో సుశాంత్. యాక్టర్ అయ్యాక కూడా ఆస్ట్రో ఫిజిక్స్‌.. ఖగోళం పై సుశాంత్‌ అనేక అధ్యయనాలు చదివాడు, తెలుసుకున్నాడు. విశ్వంలో ఉండే నక్షత్ర మండలాన్ని చూడటానికి కోట్లు పెట్టి ఓ టెలిస్కోప్‌ను కొనుక్కున్నాడు. ఇక వీలైనప్పుడల్లా ఆ టెలిస్కోప్ నుంచి విశ్వంలోకి చూస్తూ ఉండేవాడట. అతనితో సన్నిహితంగా ఉండే వారు ఈ విషయాలను తెలిపారు.

ఇక తాజాగా సుశాంత్ వీరాభిమాని ఒకరు.. గొప్ప నివాళి ప్రకటించాడు. అమెరికాలో నివసిస్తున్న రక్ష అనే వీరాభిమాని ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్‌ పేరు పెట్టాడట. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అభిమానాన్ని బయటపెట్టాడు. ‘సుశాంత్‌ ఒక అద్భుతమైన వ్యక్తి. అతనికి నివాళులు అర్పించడంలో కొంత ఆలస్యం చేశాను. ఈ చీకటి ప్రపంచంలో ఆయన ఒక స్వచ్ఛమైన రత్నం లాంటివాడు. ఆయన మరింతగా మెరవాలి. సుశాంత్ పేరు మీద ఉన్న నక్షత్రాన్ని ఆయన టెలిస్కోప్‌తో కొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఆ నక్షత్రం మరింత ప్రకాశవంతంగా మెరవాలి" అంటూ ఆ వీరాభిమాని ట్వీట్ చేశాడు.

విశ్వ మండలంలో ఉండే తారల్లో ఒకటైన RA 22.121 కు 2020 జూన్ 25 నుండి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌గా నామకరణం చేశారు. దీనికి సంబంధించి ఖగోళ శాస్త్ర సంస్థ హక్కులు కల్పించింది. ఆ నక్షత్ర సంబంధమైన హక్కులు, కాపీరైట్స్ కూడా మాకు లభించాయి" అని రక్ష పేర్కొన్నాడు. ఆల్రెడీ అంతరిక్షంలో స్థలం కలిగిన సుశాంత్.. ఆయన పేరు మీద స్టార్ ఉండటంతో తను అనుకున్నది ఈ విధంగా అయినా నెరవేరిందని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఆ వీరాభిమానిని అభినందిస్తున్నారు.