Begin typing your search above and press return to search.
హిట్టు డైరెక్టర్ ఫ్లాట్ కొట్టేశాడు.. ఇదా సంగతి!
By: Tupaki Desk | 5 Feb 2020 7:19 AM GMTతమిళ్ లో విజయం సాధించిన రాక్షసన్ ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు చిత్రంగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బెల్లంకొండకు దక్కిన నిజమైన సక్సెస్ ఇది అంటూ ప్రచారమైంది. భారీగా లాభాలు లేకపోయినా పెట్టుబడుల వరకూ సేఫ్ అయ్యింది. అంతకు ముందు శీనూ ఐదారు సినిమాలు చేసినా ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కానీ రాక్షసుడు నిర్మాత సహా పింపిణీ దారులను సంతోషపెట్టింది. దీంతో శ్రీనివాస్ కెరీర్ ట్రాక్ లోకి వచ్చింది. హిందీ మార్కెట్ ఉన్న హీరోగానూ శ్రీనుకి ఇమేజ్ ఏర్పడింది. దీంతో పంపిణీ వర్గాల్లో ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతోంది. ఈ సక్సెస్ కి అసలు కారకుడు మాత్రం దర్శకుడు రమేష్ వర్మ.
దర్శకుడిగా అతనికిది మలి ప్రయత్నమే అయినా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెలుగు వెర్షన్ కు తగ్గట్టు చక్కని మార్పులు చేసి ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించడంలో నూరుశాతం సక్సెస్ అయ్యాడు. టెక్నికల్ అంశాలపై మంచి గ్రిప్ ఉన్న దర్శకుడిగా నిరూపించుకున్నాడు. దీంతో రమేష్ వర్మపై యువ హీరోల కళ్లు పడుతున్నాయి. ప్రస్తుతం మాస్ రాజా రవితేజ తన తదుపరి సినిమాకు డైరెక్టర్ గా లాక్ చేసాడు. ఈ నేపథ్యంలో రాక్షసుడు నిర్మాత కోనేరు సత్యనారాయణ తన బ్యానర్ లోనే మరో సినిమాకు లాక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట.
రమేష్ వర్మకు సదరు నిర్మాత ఖరీదైన ప్లాట్ ను గిప్ట్ ఇచ్చారు. ప్లాట్ కాస్ట్ ఎంత? అది ఏ ఏరియాలో ఉంది? తదితర వివరాలు తెలియాల్సి ఉంది. రాక్షసుడు కి పారితోషికం ఇచ్చినా.. ఈ ఖరీదైన ప్లాట్ బహుమానం ఎందుకు? అంటే అసక్తికర సంగతులే తెలుస్తున్నాయి. సత్యనారయణ తనయుడు హవీష్ జీనియస్ తో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. అటుపై మరో రెండు...మూడు ప్రయత్నాలు చేసినా హీరోగా నిలదొక్కుకో లేకపోయాడు. ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంతో తనయుడిని దారికి తెచ్చే స్క్రిప్టును రమేష్ వర్మ రెడీ చేస్తున్నాడట. అందుకే ఇలా అడ్వాన్స్ గా ఓ ప్లాట్ ఇచ్చి డైరెక్టర్ ని లాక్ చేస్తున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి.