Begin typing your search above and press return to search.
సైకో కిల్లర్ వేట - ట్రైలర్ టాక్
By: Tupaki Desk | 18 July 2019 11:05 AM GMTఇటీవలే సీతతో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ లో కొత్తగా ట్రై చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దాంతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కమర్షియల్ సినిమాలకు దూరంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సంకేతం అయితే ఇచ్చాడు. అందులో భాగంగా చేస్తున్న మరో ప్రయత్నమే రాక్షసుడు. రమేష్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. దీని ట్రైలర్ ని ఇందాకా రిలీజ్ చేశారు.
చట్టానికి దొరక్కుండా అంతుచిక్కని రీతిలో హత్యలు చేస్తున్న సైకోని పట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు ఓ పోలీస్ ఆఫీసర్(సాయి శ్రీనివాస్). ఏ చిన్న క్లూ లేకుండా వాడిని పట్టుకోవడం సవాల్ గా మారుతుంది. అతనికి అండగా ఉంటుంది లవర్ కం టీచర్(అనుపమ పరమేశ్వరన్). కొన్ని ఆధారాలు దొరికిన తర్వాత ఆ సైకో యాంటీ సోషల్ డిజార్డర్ తో ఇలాంటి ఘాతుకాలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ హత్యల ప్రవాహానికి ఆ యువ పోలీస్ ఎలా అడ్డుకట్ట వేశాడు అనేదే రాక్షసుడు అసలు పాయింట్
కథను చూచాయగా చెప్పినప్పటికీ ఎక్కువ ట్విస్టులు బయటపడకుండా ట్రైలర్ ని కట్ చేశారు . ఫ్రేమ్స్ వేగంగా వెళ్ళడంతో ఆర్టిస్టులు సైతం అలా ఫ్లాష్ లో కనిపిస్తారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా డెప్త్ ఉన్న సీరియస్ పోలీస్ గా నటించాడు. రెగ్యులర్ రోల్ కాదు కాబట్టి పాత్రకు అనుగుణంగా ఎమోషన్స్ కూడా క్యారీ చేసాడు. అనుపమ పరమేశ్వరన్ కూడా స్కోప్ ఉన్న పాత్రే చేసింది. రాజీవ్ కనకాల-సూర్య ఇతర కీలక పాత్రలు పోషించారు.
వెంకట్ సి దిలీప్ ఛాయాగ్రహణం మూడ్ ని క్యారీ చేయగా జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంటెన్సిటీని పెంచేలా ఉంది. మొత్తానికి చాలా కాలం తర్వాత తెలుగులో సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ గా రాక్షసుడు రాబోతున్న ఇంప్రెషన్ అయితే ట్రైలర్ కలిగించింది. ఆగస్ట్ 2న విడుదల చేయబోతున్న ఈ మూవీ తమిళ బ్లాక్ బస్టర్ రట్ససన్ కు అఫీషియల్ రీమేక్