Begin typing your search above and press return to search.

ర‌ష్మిక‌తో బ్రేక‌ప్ పై ఓపెన‌య్యాడు

By:  Tupaki Desk   |   23 Dec 2019 1:30 AM GMT
ర‌ష్మిక‌తో బ్రేక‌ప్ పై ఓపెన‌య్యాడు
X
అందాల క‌థానాయిక ర‌ష్మిక‌తో క‌న్న‌డ యువ‌హీరో ర‌క్షిత్ ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. కిరిక్ పార్టీ అనే చిత్రంలో న‌టించిన ఈ జంట డీప్ ల‌వ్ లో ప‌డ్డారు. అటుపై పెద్ద‌ల్ని ఒప్పించి నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయ్యారు. కానీ ఇంత‌లోనే బ్రేక‌ప్ అంటూ ఓ వార్త సంచ‌ల‌న‌మైంది. `ఛ‌లో`.. `గీత గోవిందం` చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం అటుపై కెరీర్ స్వింగులోకి రావ‌డంతో ర‌ష్మిక అత‌డికి బ్రేక‌ప్ చెప్పేసింద‌ని టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపించాయి. ఇదే విష‌యంపై ర‌ష్మిక‌ను ర‌క్షిత్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే దీనిపై ర‌ష్మిక ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో ఆన్స‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసినా ఎవ‌రూ విన‌లేదు. దానివ‌ల్ల ఇప్ప‌టికీ ఆ జోడీ మ‌ధ్య ఏం జ‌రిగింది? అన్న‌ది ఎవ‌రికీ అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

2017లో ర‌ష్మిక‌-ర‌క్షిత్ జంట‌ నిశ్చితార్థం అయ్యింది. అయితే ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రూ బ్రేక‌ప్ అవ్వ‌డం సంచ‌ల‌న‌మైంది. 2018 సెప్టెంబ‌ర్ లో విడిపోయిన‌ప్ప‌టి నుంచి ఈ బ్రేక‌ప్ పై ర‌క‌ర‌కాల కార‌ణాలు ప్ర‌చార‌మ‌య్యాయి. నిశ్చితార్థం ర‌ద్దు చేసుకోవ‌డానికి కార‌ణం ర‌ష్మిక కేవ‌లం కెరీర్ పైనే దృష్టి సారించాల‌ని అనుకోవ‌డమేన‌ని ప్ర‌క‌టించింది. అయితే ఇదే నిజ‌మా? ఇంకేదైనా కార‌ణం ఉందా? అంటూ ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. ఇక ఇటు ర‌ష్మిక కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగులో ఉండ‌గా.. అటు క‌న్న‌డ‌నాట ర‌క్షిత్ సైతం అంతే బిజీగా ఉన్నాడు. ఇటీవ‌ల `అత‌డే శ్రీ‌మ‌న్నారాయ‌ణ` అనే చిత్రాన్ని సౌత్ లో అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నాడు. క‌న్న‌డ‌తో పాటు తెలుగులోనూ నిరూపించుకోవాల‌న్న పంతంతో ఉన్నాడు.

తాజాగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ర‌క్షిత్ కి త‌న ప్రేమాయ‌ణంపై ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. ఇటీవ‌ల ఓ మీడియా మీట్ లో ల‌వ్ బ్రేక‌ప్ ఏం నేర్పింది? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌రంగా స్పందించాడు. జీవితం ఎన్నో నేర్పిస్తుంటుంది. కొన్ని మంచి చేస్తే.. కొన్ని చెడు చేస్తాయి. ప్ర‌తి దాని నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లాలి. అలాంటి స‌న్నివేశం రావ‌డానికి ఒక్కొక్క‌రికి ఒక్కో కార‌ణం ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఎంతో నేర్చుకోవ‌చ్చు. రిలేష‌న్ షిప్స్ మాత్ర‌మే కాదు స్నేహంలో కూడా ఇలాంటివి ఉంటాయి. లైఫ్ లో ఇలాంటివ‌న్నీ ఎన్నో ఉంటాయి. వీటిని చిన్న‌గా భావించి ముందుకు వెళ్లాలి. లైఫ్ ఇంకా చాలా పెద్ద ప‌ర్ప‌స్ తో సాగుతుంటుంది. మ‌నం సాధించాల్సిన‌వి ఎన్నో ఉంటాయి అని ఎంతో పాజిటివ్ గా స్పందించాడు.