Begin typing your search above and press return to search.

దళపతి 67: ఆ స్టార్ కూడా స్పెషల్ రోల్

By:  Tupaki Desk   |   17 Jan 2023 5:43 AM GMT
దళపతి 67: ఆ స్టార్ కూడా స్పెషల్ రోల్
X
లోకేష్ కనకరాజ్, విజయ్ కాంబోలో వస్తున్న దళపతి 67 సినిమాలో ప్రముఖ హీరో, ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టి భాగం కానున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని ఓ పాత్రకు రక్షిత్ శెట్టి అయితేనే బాగా సెట్ అవుతారని భావించిన చిత్ర బృందం ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. 777 చార్లీ హీరో ఈ సినిమాకు సంతకం చేయకపోయినప్పటికీ.. చర్చలు జరుగుతున్నాయట. రక్షిత్ శెట్టి ఈ సినిమాలో నటిస్తే ఈ ప్రాజెక్టుకి మరింత క్రేజ్ వస్తుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటించబోతుంది. అలాగే హీరోయిన్ ప్రియా ఆనంద్ కూడా ఈ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. దీనికితోడు ఆమె ఇటీవలే దళపతి 67 సినిమాకు సంబంధించిన ఓ పోస్టును లైక్ చేసింది.

దీంతో ఈ సినిమాలో ప్రియా ఆనంద్ కూడా ఉండబోతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ముఖ్య పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

హీరో సూర్య, సంజయ్ దత్, అర్జున్, సివిన్ పౌలీ, గౌతమ్ మేనన్, మన్సూర్ అలీ ఖాన్ లాంటీ పెద్ద పెద్ద నటీనటులు ఈ సినిమాలో సందడి చేయబోతున్నారు. చైన్నైలోని ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ ను కాశ్మీర్ లో ప్లాన్ చేశారు. దళపతి 67 బడ్జెట్ 200 కోట్ల రూపాయలను దాటేసినట్లు తెలుస్తోంది.

క్లాస్ ప్లస్ మాస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలే నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా హక్కులకు ఎక్కడా లేని డిమాండ్ వచ్చి పడింది. సౌత్ ఇండియాలోనే అత్యధిక మొత్తానికి ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడు పోయినట్లు అంతా భావిస్తున్నారు.

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ దళపతి 67 డిజిటల్ హక్కులను ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకోవడం విశేషం. అన్ని భాషల డిజిటల్ హక్కులు ఈ డీల్ కింద నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.