Begin typing your search above and press return to search.

కమల్ డెడికేషన్ కి రకుల్ ఫిదా..!

By:  Tupaki Desk   |   12 Dec 2022 3:30 PM GMT
కమల్ డెడికేషన్ కి రకుల్ ఫిదా..!
X
లోక నాయకుడు కమల్ హాసన్ డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా అంటే ఆయనకున్న ప్రేమ ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. 67 ఏళ్ల వయసులో కూడా కమల్ హాసన్ ఇప్పటికీ సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తుంటారు. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన పడుతున్న కష్టాన్ని చూసి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ కమల్ గురించి గొప్పగా చెప్తుంది. సినిమా అంటే ఇంత అభిమానం ఉన్న వారు మరెవరు ఉండరేమో.. ఇండియన్ 2 కొసం 90 ఏళ్ల వయసు గల పాత్ర లో కమల్ నటించనున్నారు.

ఆ పాత్ర కోసం ప్రొస్తెటిక్ మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. మేకప్ కి ఎక్కువ టైం పడుతుందని తెలిసి ఉదయం 5 గంటలకే కమల్ హాసన్ సెట్స్ కు వస్తున్నారట. ఐదు గంటలకు మేకప్ మొదలు పెడితే 10 గంటలకు అంటే దాదాపు మేకప్ కోసం 5 గంటలు టైం తీసుకుంటున్నారట.

అప్పటివరకు ఆయన కదలకుండా చాలా ఓపికగా ఉంటున్నారని చెప్పింది రకుల్. ఇక చెన్నైలో ఉన్న వేడికి అసలు అన్ని గంటలు మేకప్ వేసుకుని ఉండటం చాలా కష్టమని. మేకప్ తీసేందుకు మరో రెండు గంటలు టైం తీసుకుంటున్నారని అన్నది రకుల్.

తన జీవితంలో దాదాపు 75 శాతం సినిమా కోసమే కమల్ కేటాయించారని అంటుంది రకుల్. పాత్ర పర్ఫెక్ట్ గా వచ్చేందుకు ఒక్కోసారి డైరెక్ట్ అయినా కాంప్రమైజ్ అవుతాడు కానీ కమల్ హాసన్ మాత్రం అవడు. అందుకే ఆయన్ని యూనివర్సల్ స్టార్ అని అంటారు.

పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ మూవీకి సీక్వెల్ గా అంతకుమించిన రేంజ్ లో ఈ సినిమా వస్తుంది. సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇండియన్ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ సీక్వెల్ కోసం కూడా సినీ ప్రియులు చాలా ఎక్సయిట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. విక్రం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్ ఇండియన్ 2తో కూడా హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 2023 సమ్మర్ రిలీజ్ ఫిక్స్ చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.