Begin typing your search above and press return to search.
రకుల్ తెర వెనుక ట్రైనింగ్ ఇంట్రెస్టింగ్!
By: Tupaki Desk | 22 Sep 2022 12:30 AM GMTఎలాంటి పాత్రలోనైనా నటి పరకాయ ప్రవేశం చేయకపోతే పనవ్వదు. నటిగా సక్సెస్ కావాలంటే వందశాతం పనిచేయాల్సిందే. ఈ క్రమంలో దర్శకులు చెప్పినట్లు నడుచుకోవాలి. వాళ్ల సృజనాత్మకతను మ్యాచ్ చేయగలగాలి. అందుకే సాహసోపేతమైన పాత్రల విషయంలో దర్శకులు ముందుగానే ట్రైనప్ చేస్తారు. దానికి సంబంధించి టెస్ట్ షూట్..ఫోటో సెషన్స్ నిర్వహిస్తుంటారు.
అలా అన్నిరకాలు గా వర్కౌట్ అవుతుందంటేనే? ఆ హీరోయిన్ ని ఫైనల్ చేస్తారు. ముఖ్యంగా కొత్త వాళ్ల విషయంలో ఇలాంటివి తరుచూ జరుగుతుంటాయి. చాలా రేర్ గానే సీనియర్లు ఇలాంటి పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం సీనియర్ నటి అయినా పర్పెక్షన్ కోసం దర్శకుడు చెప్పకుండానే తనకు తానుగానే సెల్ప్ ట్రైనింగ్ తీసుకున్నట్లు ఆలస్యంగా రివీల్ చేసింది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో `డాక్టర్ జి` చిత్రంతో పాటు...`థాంక్ గాడ్` చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. డాక్టర్ జీ లో మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించనుంది. తాజాగా ఆ పాత్రకి సంబంధించి తనుకు తానుగా ఎలా ట్రైనప్ అయిందో రివీల్ చేసింది. గైనకాలజిస్ట్ పాత్ర కోసం ఆమె ఓ ప్రోఫెషనల్ డాక్టర్ ని ముందుగానే కలిసి ఎలా ఉండాలి? అన్న వివరాలు అడిగి తెలుసుకుందిట.
` మెడికల్ క్యాంపస్ కామెడీలో తన పాత్రతో మెప్పించేలా చేయడానికి శిక్షణ పొందిన వైద్య విద్యార్థి నుండి వైద్య పరికరాలను ఎలా వినియోగించాలి. డాక్టర్‌లా ప్రవర్తించడం ఎలా అనే అంశాల్ని స్వయంగా అడిగి తెలుసుకుందిట. అవసరమైన చోట మ్యానరిజమ్ ఎలా ఉంటుందన్నది అడిగి తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చింది.
అలాగే `థాంక్ గాడ్` లో పోలీస్ పాత్ర కోసం బాగానే శ్రమించింది. ప్రొఫెషనల్ పోలీస్ అధికారి ఎలా నడుచుకోవాలో? దానికి సంబంధించి నేరుగా పోలీస్ యూనిఫాం వేసిన రియల్ పోలీసుల్నే సంప్రదించిందిట. ఉమెన్ పోలీస్ మ్యానరిజమ్ ఎలా ఉంటుంది? ఏ కేసుని ఎలా డీల్ చేస్తారు? వంటి అంశాలు పోలీసుల్నే అడిగి తెలుసుకుందిట.
ఇవన్నీ సినిమా ప్రారంభానికి ముందు డైరెక్టర్ పాత్ర గురించి చెప్పగానే ఆ పాత్రల కోసం రకుల్ ఈ విధంగా ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి రకుల్ మరోసారి ఫ్యాషినేటెడ్ నటిగా నిరూపించుకునే ప్రయత్నం ప్రశంసనీయం. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఆరంభంలో నటుడిగా సక్సెస్ అవ్వడానికి ఎంతో శ్రమించారు. పాత్ర గురించి చెప్పగానే దానికి సంబంధించి ఎలా ఉండాలి? అన్నది ఆయనకు ఆయనగానే సొంతంగా ప్రాక్టీస్ చేసేవారు. మెగాస్టార్ ఆ క్వాలిటీ అప్పట్లో చాలా మంది దర్శకుల్ని ఆకట్టుకుంది. ఆయన క్రమశిక్షణ...నటుడిగా సక్సెస్ కావాలి అన్న కసి పట్టుదలే మెగాస్టార్ ని చేసిందన్నది తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.