Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ తో స్టార్ హీరో వైఫ్ వంట‌కాలు

By:  Tupaki Desk   |   15 April 2021 8:43 AM GMT
స్టార్ హీరోయిన్ తో స్టార్ హీరో వైఫ్ వంట‌కాలు
X
టాలీవుడ్ బాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్ల‌తో ర‌కుల్ హ‌డావుడి తెలిసినదే. ఓవైపు క్రిష్ సినిమా చేస్తూనే అటు బాలీవుడ్ లో క‌థ‌లు విని వాటిని ఫైన‌ల్ చేసేయ‌డం వెంట వెంట‌నే షూటింగుల‌కు ప‌రుగులు తీయ‌డం చూస్తున్న‌దే. ఇంత బిజీలోనూ ర‌కుల్ ఖాళీ స‌మ‌యాన్ని వంట‌ల కార్య‌క్ర‌మంతో స‌ద్వినియోగం చేసింది.

అది కూడా త‌న ఫ్రెండు ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి హెల్త్ వెబ్ చానెల్ కోసం ఈ వంట‌ల కార్య‌క్ర‌మంలో ప్రత్య‌క్ష‌మైంది. స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ భార్యామ‌ణి ఉపాస‌న యువ‌ర్ లైఫ్ డాట్ ఇన్ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించి ప్ర‌త్యేకంగా లైఫ్ స్టైల్.. ఆరోగ్యం త‌దిత‌ర విషయాల‌పై అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఓవైపు అపోలో సేవ‌ల గురించి వెల్ల‌డిస్తూనే.. ర‌క‌ర‌కాల సామాజిక విష‌యాల‌పైనా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచుతున్నారు.

ఇక యువ‌ర్ లైఫ్ డాట్ ఇన్ కోసం ఇంత‌కుముందు స‌మంత ర‌క‌ర‌కాల వంట‌కాల గురించి చెప్పారు. ఇప్పుడు ఫిట్నెస్ ఫ్రీక్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ స్పెష‌ల్ వంట‌కాన్ని ప‌రిచ‌యం చేశారు. ఇందులో ఓ పంజాబీ డిష్ గురించి ర‌కుల్ టిప్స్ చెప్పారు. రోటీ పాల‌క్ త‌ర‌హాలో ప‌చ్చ‌ని ఆకుకూర‌తో ఈ వంట‌కాన్ని రెడీ చేయ‌డంతో అంద‌రికీ నోరూరిపోతోంది.

ఇది హెల్దీ సీజ‌న‌ల్ పంజాబీ ఫెస్టివ‌ల్ ఫుడ్ అంటూ ర‌కుల్ ప‌రిచ‌యం చేశారు. ఉగాది సంద‌ర్భంగా ఈ స్పెష‌ల్ వంట‌కాన్ని ర‌కుల్ ప్రిపేర్ చేశార‌ట‌. పండ‌గ‌ల వేళ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని ఎలా సింపుల్ స్టెప్ప్ లో త‌యారు చేసుకోవాలో ఈ వెబ్ సైట్లో పూర్తి వీడియో చూడమంటున్నారు ఉపాస‌న‌.