Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: రకుల్.. ఫ్యాషన్ ఫెయిల్!

By:  Tupaki Desk   |   24 March 2020 1:30 AM GMT
ఫోటో స్టోరీ: రకుల్.. ఫ్యాషన్ ఫెయిల్!
X
బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడంటే టాలీవుడ్ లో కొంచెం స్లో అయింది కానీ రెండేళ్ళ క్రితం మాత్రం యమా జోష్ లో ఉండేది. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగింది. అయితే వరస పరాజయాలు రకుల్ కెరీర్ పై ప్రభావం చూపించాయి. ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో హిందీ.. తమిళంపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఏదో ఒక అప్డేట్ ఇస్తూ తనను ఫాలో ఫాలో అంటూ ఫాలో అయ్యేవారికి నిత్యం టచ్ లో ఉంటుంది. ఒకవేళ రకుల్ కనుక టచ్ లో లేకపోతే అభిమానులే ఏదో ఒక పాత ఫోటోను ట్రెండింగ్ చేస్తూ.. వైరల్ చేస్తూ రకుల్ ను గుర్తు చేసుకుంటారు. రకుల్ ఓ ఫిట్నెస్ ఫ్రీక్.. ఫ్యాషనిస్టా అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే రకుల్ స్టైలిష్ గా ఉన్న ఫోటోలు.. ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేసే ఫోటోలు.. డిజైనర్ డ్రెస్సుల్లో జనాలను మాయ చేసే ఫోటోలు చాలా కామన్. అందుకే ఫర్ ఎ ఛేంజ్ అన్నట్టుగా ఫ్యాషన్ డిజాస్టర్ అయిన ఫోటోలను వెతికి తీస్తే.. మీరుపైన చూస్తున్న ఫోటో బయటపడింది.

ఫోటో చూడగానే ఎందుకు ఫ్యాషన్ డిజాస్టర్ అనేది అర్థం అయిపోతుంది. పొట్టి గౌన్లు ధరించిన సమయంలో అలా కూర్చోకూడదు. రెండవది.. అలాంటి భంగిమలు ఉన్నప్పుడు ఫోటోగ్రాఫర్లు కెమెరాలను క్లిక్ మనిపించకూదు. ఇక్కడ ఆ రెండు తప్పులు జరిగిపోయాయి. రకుల్ తేడాగా కూర్చుంది.. ఫోటోగ్రాఫర్ రాంగ్ యాంగిల్ లో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఏదైతేనేం.. ఇది మాత్రం ఫ్యాషన్ డిజాస్టరే. దీని సంగతి పక్కనబెట్టి రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'థ్యాంక్ గాడ్' అనే సినిమాలోనూ.. మరో పేరు నిర్ణయించని హిందీ సినిమాలో నటిస్తోంది. తమి