Begin typing your search above and press return to search.

రకుల్.. నవ్వుతోనే గ్లామర్ హీట్ పెంచేసింది

By:  Tupaki Desk   |   20 July 2022 5:07 PM GMT
రకుల్.. నవ్వుతోనే గ్లామర్ హీట్ పెంచేసింది
X
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ బ్యాడ్ లక్ ఏంటో గాని ఇటీవల కాలంలో తెలుగులో ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. మరొక వైపు బాలీవుడ్ లో మాత్రం గ్యాప్ లేకుండా పెద్ద సినిమాల్లో నటించే అవకాశం అయితే దక్కించుకుంటోంది.

ఇక సోషల్ మీడియాలో రకుల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలతో తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటూనే ఉంటుంది.

ఇక రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో కాస్త వేడిని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్న రకుల్ చక్కిలిగింతలు పెట్టిన అమ్మాయిల అందంగా నవ్వుతోంది.

అంతేకాకుండా తన నడుము అందాలను కూడా ఆ ఫ్రేమ్లో చాలా చక్కగా ప్రజెంట్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా ఒక రేంజ్ లో ఉంటుంది అని మరొకసారి నిరూపించింది. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది రెండు తెలుగు సినిమాలు చేసింది. ముఖ్యంగా నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ సినిమా లో లాయర్ పాత్రలో కనిపించి నటనతో ఆకట్టుకున్నప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది.

అలాగే కొండపొలం సినిమా లో కూడా గ్లామర్ ను పక్కన పెట్టేసి ఒక పల్లెటూరి అమ్మాయిల గొర్రెల కాపరి గా కనిపించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే వరుసగా కొన్ని సినిమాలతో బిజీగా మారిపోయింది. అలాగే మరో తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. తెలుగులో కూడా త్వరలోనే ఒక సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.