Begin typing your search above and press return to search.

40 రోజుల్లో 8 కిలోలు త‌గ్గాను.. ట్రోల్స్ ప‌ట్టించుకోను!

By:  Tupaki Desk   |   18 Jan 2021 5:30 PM GMT
40 రోజుల్లో 8 కిలోలు త‌గ్గాను.. ట్రోల్స్ ప‌ట్టించుకోను!
X
అవ‌స‌రాన్ని బ‌ట్టి రూపం మార్చుకునేందుకు ఎంతైనా శ్ర‌మించ‌డం మ‌న క‌థానాయిక‌లకు అల‌వాటు. స్క్రిప్టు డిమాండ్ మేర‌కు రూపురేఖ‌ల్ని తీర్చిదిద్దుకునే నాయిక‌గా ర‌కుల్ ప్రీత్ పేరు ఇటీవ‌ల వినిపించింది. మ‌న్మ‌ధుడు 2.. దేదే ప్యార్ దే చిత్రాల కోసం ర‌కుల్ చాలా స్లిమ్మ‌య్యింది. అయితే అప్ప‌ట్లో త‌న‌పై సోషల్ మీడియాల్లో దారుణ‌మైన ట్రోల్స్ ఎదుర‌య్యాయి.

ఇక ర‌కుల్ ప‌ని అయిపోయిన‌ట్టేన‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే వాట‌న్నిటికీ ఎదురు నిలిచి తాను అనుకున్న‌ది సాధించుకున్నాన‌ని ర‌కుల్ తాజా ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించింది. అప్ప‌ట్లో హిందీ సినిమా దేదే కోస‌మే 8 కేజీల బ‌రువు త‌గ్గాన‌ని తెలిపింది. దీనికోసం కేవ‌లం 40 రోజుల స‌మ‌యం స‌రిపోయింద‌ని వెల్ల‌డించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేవ‌గ‌న్ -ట‌బు లాంటి అగ్ర తార‌ల‌తో న‌టించాల‌నే దేదేలో పాత్రను అంగీకరించాన‌ని వెల్ల‌డించారు.
``నేను ఎందుకు చాలా స్లిమ్ అయ్యాను అని చాలా మంది ఆశ్చర్యపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నా క‌థ ముగిసిన‌ట్టేన‌ని వ్యాఖ్యానించారు`` అని రకుల్ అన్నారు. కానీ ఏదీ తాను ప‌ట్టించుకోలేద‌ని తెలిపారు.

ర‌కుల్ న‌టిస్తున్న‌ బాలీవుడ్ చిత్రం ‘మే డే’. హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో చిత్రీక‌రించిన సంగ‌తి తెలిసిన‌దే. క్రిష్ దర్శకత్వంలో వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న న‌టించింది. నితిన్ స‌ర‌స‌న ‘చెక్’ అనే చిత్రంలో న‌టించ‌నుంది.