Begin typing your search above and press return to search.
రకుల్ సామాన్లు సర్దేశినట్టేనా..?
By: Tupaki Desk | 1 Feb 2021 11:30 AM GMT‘ఎన్నాళ్లో వేచిన ఉదయం...’ అంటూ పాట పాడుతోంది రకుల్ ప్రీత్ సింగ్! సౌత్ లో తానేంటో నిరూపించిన ఈ భామ.. నార్త్ లో సత్తా చాటాలని కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. బాలీవుడ్ లో ఎలాంటి ఆఫర్ వచ్చినా కాదనుకుండా ఓకే చేస్తోంది. తాజాగా మరో ఆఫర్ రావడంతో సైన్ చేసేసింది రకుల్.
బాలీవుడ్లో జెండా పాతాలంటూ ఎప్పటి నుంచో దండ యాత్రలు చేస్తోంది రకుల్. ఇప్పటికే.. హిందీలో యారియాన్, అయ్యారే, దేదే ప్యార్ దే వంటి మూడు సినిమాల్లో నటించింది. కానీ.. ఈ మూడు సినిమాల్లో ఏదీ కూడా రకుల్‌కు సరైన బ్రేక్ ఇవ్వలేదు. ఆశించిన మేర విజయం సాధించకపోవడంతో సౌత్ లో కంటిన్యూ చేస్తూనే బాలీవుడ్ ట్రయల్స్ వేస్తూనే ఉంది.
ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది రకుల్. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా రానున్న ఏప్రిల్ 22న విడుదల కాబోతోంది. ఈ చిత్రం తర్వాత ‘థాంక్ గాడ్’ మూవీలోనూ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ చిత్రాలతో బిజీగా ఉంది.
అయితే.. లేటెస్ట్ గా మరో బాలీవుడ్ మూవీకి సైన్ చేసిందట. యువ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో రకుల్ ప్రీత్ సింగ్ జోడి కట్టనుంది. ‘డాక్టర్ జీ’ పేరిట ఓ కామెడీ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ డాక్టర్ ఉదయ్ పాత్రలో నటిస్తుండగా.. ఆయన సీనియర్ డాక్టర్ ఫాతిమా పాత్రలో రకుల్ కనిపించనుంది.
అనుభూతి కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ లో పోస్టు కూడా చేసింది. ఈ సినిమాలో భాగమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని, షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది రకుల్.
ఈ విధంగా వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తున్న రకుల్.. టాలీవుడ్ నుంచి పెట్టేబేడా ముంబైకి సర్దేస్తుందా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించిందీ బ్యూటీ. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బీటౌన్‌లో సినిమాలు చేస్తోంది. ఇప్పుడు చేతిలో ఉన్న మూడు సినిమాల్లో ఒకటీ రెండు హిట్టయినా.. ముంబైలోనే సెటిలయిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి, ఏం జరుగుతుందో?