Begin typing your search above and press return to search.

కండోమ్ టెస్ట‌ర్ రోల్ పై ర‌కుల్ పేరెంట్స్ రియాక్ష‌న్!

By:  Tupaki Desk   |   13 Oct 2022 11:30 PM GMT
కండోమ్ టెస్ట‌ర్ రోల్  పై ర‌కుల్ పేరెంట్స్ రియాక్ష‌న్!
X
నిన్న‌..మొన్న‌టి వ‌ర‌కూ టాలీవుడ్ లో మెరిసిన‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో కొన్ని హిందీ సినిమాలున్నాయి. మ‌న‌సంతా బాలీవుడ్ పైనే పెట్టి ప‌ని చేస్తోంది. సంద‌ర్భాన్ని బ‌ట్టి సౌత్ సినిమాల‌పై అప్పుడ‌ప్పుడు అమ్మ‌డు సెటైర్లు గుప్పించ‌డం ప‌రిపాటిగా మారిన సంగ‌తి తెలిసిందే.

సౌత్ లో లేడీ ఓరియేంటెండ్ ఆఫ‌ర్ల‌పై వ్యాఖ్యానించ‌డమే అమ్మ‌డికి ఇక్క‌డ కాస్త నెగిటివ్ తెచ్చిపెట్టింది. అలాగని అవ‌కాశాలు రాక‌పోలేదు. శంక‌ర్ 'ఇండియన్-2'లో న‌టిస్తోంది. ఆ సంగ‌తి ప‌క్కన‌బెడితే బాలీవుడ్ ప్రాజెక్ట్ 'డాక్ట‌ర్. జి'లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి.

ఆర్ధోపెడిక్ డాక్ట‌ర్ అవ్వాల‌నుకున్న హీరో గౌన‌కాల‌జిస్ట్ అయితే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అన్న‌ది ఆద్యంతం వినోదాత్మ‌కంగా మ‌లిచారు. ఇందులో ర‌కుల్ కండోమ్ టెస్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఇలాంటి రోల్ చేయాలంటే ఎవ‌రికైనా కొన్ని లిమిటేష‌న్స్ ఉంటాయంటారు. తేడా జ‌రిగితే నెట్టింట ట్రోలింగ్ త‌ప్ప‌దు. కానీ ర‌కుల్ ఈపాత్రని ఎంతో పాజిటివ్ గా తీసుకుని చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.

ఈ పాత్ర విష‌యంలో ఎలాంటి స‌వాళ్లు ఎదురైనా ఫేస్ చేయ‌డానికి సిద్దంగా ఉన్నానంటూ చెప్ప‌క‌నే చెప్పేసింది. తాజాగా ఈ రోల్ గురించి మీ ఇంట్లో త‌ల్లిదండ్రులకి తెలుసా? అని ప్ర‌శ్నిస్తే ధీటైన‌ బ‌ధులిచ్చి అంద‌రి నోళ్లు మూయించింది. సామాజిక స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌కు తెర తీసే చిత్రాలివి. అందుకే వీటిని నా త‌ల్లిదండ్ర‌లు గొప్ప ఆలోచ‌న‌గా భావించారు.

న‌న్ను ఎంత‌గానో ప్రోత్స‌హించారు. డాక్ట‌ర్ జిలో గైన‌కాల‌జిస్ట్ అయిన ఓ పురుషి వైద్యుడి గురించి చ‌ర్చించాం. మ‌న వ‌ద్ద ఇలాంటి వాటిపై నిషేద్దం ఉండ‌టం దుర‌దృష్ట క‌రం. గుండె..మొద‌డు.. ఊపిరి తిత్తులు..కిడ్నీలు ఇలా శ‌రీరంలో ఇత‌ర వ్య‌వ‌స్థ‌ల‌కంటే? పున‌రుత్స‌తి అవ‌య‌వాన్నే ఎందుకు భిన్నంగా చూడాలి. శ‌రీరంలో ఏ భాగానికి జ‌బ్బు చేసినా చికిత్స చేయ‌డం వైద్యుడి ప‌ని.

ఆ వైద్యుడు మ‌గ‌వాడు అయితే ఏంటి? మ‌హిళ అయితే ఏంటి? దానిపైనే మేము డాక్ట‌ర్ .జిలో చాలా లోతుగా చ‌ర్చించాం. మ‌న ఆలోచ‌న విధాన్ని బ‌ట్టే మ‌న ప్ర‌వ‌ర్త‌న తీరు ఆధార ప‌డి ఉంటుంది. నిజమైన త‌ప్పుని త‌ప్పుగా ప్ర‌శ్నించాం. ఇలాంటి వాటి విష‌యాల్లో మాత్రం చాలా ప‌రిమితులు గుర్తొస్తాయ‌ని' అని తెలిపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.