Begin typing your search above and press return to search.
11ఏళ్ల కెరీర్ లో సక్సెస్ `కీ` కనిపెట్టలేకపోయిందట!
By: Tupaki Desk | 14 May 2021 8:51 AM GMTసౌత్ పరిశ్రమల్లో దశాబ్ధ కాలం పాటు కెరీర్ ని సాగించింది రకుల్ ప్రీత్ సింగ్. ఇన్నేళ్లలో అసలు సక్సెస్ కి కలిసొచ్చే కారణం ఏదో కనిపెట్టలేకపోయిందట. తన విజయానికి ఫలానా కారణం ఉందని చెప్పలేకపోతోంది. అయితే స్టార్ డమ్ కోల్పోతానేమో అనే భయం తనలో ఉంటుందట.
జనం మన పనిని మెచ్చుకోవడం.. ప్రేక్షకుడి ముఖం మీద తెచ్చే ఒక చిరునవ్వు లేదా వారే స్వయంగా వచ్చి `మీ సినిమాను ఇష్టపడ్డాము` అని చెప్పినప్పుడు అది సంతోషాన్నిస్తుంది అని రకుల్ అన్నారు.
``పరిశ్రమలో నేను భయంతో జీవించను. నేను ఏమీ లేకుండా వచ్చాను. చాలా మంది సినిమాలు చేయాలనుకున్నా కానీ రాని ఆ అవకాశం నాకు లభించింది. నేను నా కలల్లో జీవిస్తున్నాను! `` అని తెలిపింది. 30ఏళ్ళ రకుల్ తన ఎంపికలకు కారణం ఒక్కోసారి మంచి స్క్రిప్ట్ పాత్రలు అని తెలిపింది. లేదా ఒక్కోసారి దర్శక హీరోల్ని బట్టి కూడా ఎంపికలు మారతాయని వెల్లడించారు.
ప్రస్తుతం అర్జున్ కపూర్ తో కలిసి నటించిన OTT చిత్రం సర్దార్ కా గ్రాండ్సన్ విడుదల కోసం ఎదురుచూస్తోంది. మే 18 న నెట్‌ఫ్లిక్స్ లో ఇది విడుదల కానుంది. మేడే-ఎటాక్-ఇండియన్ 2-థాంక్స్ గాడ్ చిత్రాలు సహా ఆయుష్మాన్ ఖుర్రానా తో డాక్టర్ జి.. చిత్రంలో చేస్తోంది.
2009లో రకుల్ కన్నడ చిత్రం గిల్లీతో కెరీర్ ప్రారంభించింది. కెరటం -వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సహా చాలా చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత సౌత్ అన్ని భాషల్లోనూ పాపులరైంది.