Begin typing your search above and press return to search.
క్లాసిక్ లుక్ తో కిల్ చేస్తున్న రకుల్ ప్రీత్
By: Tupaki Desk | 7 Aug 2021 10:30 AM GMTక్లాసీ లుక్ తో కిల్ చేయడమెలానో రకుల్ నే అడగాలి. గత రెండు లాక్ డౌన్ సీజన్లను ఈ అమ్మడు బాగానే సద్వినియోగం చేసుకుందనడానికి మారిన ఈ కొత్త రూపమే సాక్ష్యం. సైజ్ జీరో లుక్ కి మారిపోయి షాక్ లిస్తోంది రకుల్. ఈ లుక్ నెవ్వర్ బిఫోర్ అంటూ రకుల్ కి యూత్ కితాబిచ్చేస్తోంది. కొందరైతే మరీ ఇలా సన్నజాజి సోయగంలా మారిపోయిందేమిటి? అంటూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పింక్ క్లాసీ అనిపించే టాప్ ని ధరించి బాటమ్ లో బ్లాక్ జీన్స్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ స్టైల్ ఎక్కువగా చాలా సౌకర్యవంతమైన దుస్తుల్లో క్లాస్ గా కనిపించేందుకే ఇష్టపడుతుంది. ఈ బ్యూటీ అద్భుతమైన వార్డ్రోబ్ సేకరణతో ప్రతిసారీ మెరిపిస్తోంది. తాజాగా వైట్ క్రాప్ టాప్ లో రకుల్ ప్రీత్ సింగ్ రాకింగ్ లుక్ వైరల్ గా మారింది.
డాక్టర్ జి సెట్స్ నుండి రకుల్ ప్రీత్ సింగ్ డ్రాప్డ్ బిటిఎస్ క్లిప్
జూలై 30 న విడుదల చేసిన సంగతి తెలిసిందే. బోపాల్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. వీడియో క్లిప్ లలో ఆన్ ద లొకేషన్‌కి మేకప్ వేయడాన్ని చూడవచ్చు. మరొక వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక ప్రముఖ భారతీయ చిరుతిండి అయిన చాట్ ను ఆస్వాదిస్తోంది. ``చాట్ ఖా కే హుయే జంగిల్ #డాక్టర్ జి #నైట్షూట్ #జంగ్లీప్ పిక్చర్స్ (సిక్)`` నైట్ షూట్ లో సినిమా తారాగణం - సిబ్బంది భోజనాన్ని ఆస్వాదించారు.
ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో చాలా సినిమాలు చేస్తోంది. వచ్చే రెండేళ్లు కూడా అక్కడ సినిమాలతోనే బిజీగా ఉంటుంది. అలాగే తెలుగులో క్రిష్ దర్శకత్వంలో కొండపొలం రిలీజ్ కి రావాల్సి ఉంది. అడవి నేపథ్యం.. విజువల్ గ్రాఫిక్స్ బేస్డ్ సినిమా ఇది. `31 లేడీస్ నైట్` అనే మరో చిత్రంలోనూ రకుల్ నటిస్తోంది. అటు కొన్ని తమిళ్ సినిమాలు కూడా చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో `మేడే`లో నటిస్తోంది. ఈ థ్రిల్లర్ డ్రామాలో పైలట్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆయుష్మాన్ ఖురానాతో కలిసి డాక్టర్ జి అనే చిత్రంలో కూడా రకుల్ నటిస్తుంది. ఇంకా పలు హిందీ సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి.
నాగార్జున సరసన నటించిన మన్మథుడు 2 పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నా డిజాస్టర్ రిజల్ట్ తీవ్రంగా నిరాశపరిచింది. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా తనను వరుస అవకాశాలు వరించాయి. సెట్స్ పై ఉన్న అరడజను సినిమాల్లో కనీసం రెండు హిట్లు పడినా కెరీర్ ని చాలా కాలం డ్రైవ్ చేయగలదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారతీయుడు 2 వివాదాల వల్ల ఆగిపోయింది. ఈ సినిమాతో తన స్టార్డమ్ పై ఎంతో హోప్ పెట్టుకున్న రకుల్ కి నిరాశే ఎదురైంది.