Begin typing your search above and press return to search.

వీడియో : రకుల్‌ టీ షర్ట్‌ వేసుకునే ఛాలెంజ్‌

By:  Tupaki Desk   |   11 April 2020 1:00 PM GMT
వీడియో : రకుల్‌ టీ షర్ట్‌ వేసుకునే ఛాలెంజ్‌
X
దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో సినీ తారలు అంతా కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో సెలబ్రెటీలు వారి ఇంట్లో చేస్తున్న పనులు వారు ఎలా ఈ టైంను గడుపుతున్నారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో తమ ఫాలోవర్స్‌ తో షేర్‌ చేసుకుంటూనే ఉన్నారు. ఇక ఈ సమయంలోనే కొత్త కొత్త ఛాలెంజ్‌ లు కొత్త కొత్త టాస్క్‌ లను కూడా సెలబ్రెటీలు చేసుకుంటూ టైం పాస్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వీకెండ్‌ ఛాలెంజెస్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. అందులో భాగంగా సెలబ్రెటీలు తమకు నచ్చిన ఛాలెంజ్‌ లను తమ స్నేహితులకు ఇతర సెలబ్రెటీలకు ఇస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వీకెండ్‌ ఛాలెంజెస్‌ లో భాగంగా కాళ్లు గోడకు పెట్టి చేతులు కిందకు పెట్టి టీ షర్ట్‌ వేసుకుంది. ఇది చెబుతుంటే సింపుల్‌ గా ఉన్నా కూడా చేయడానికి చాలా కష్టం. కాళ్లు పైకి ఉన్న సమయంలో రెండు చేతుల మీద బ్యాలన్స్‌ ఆగడమే కష్టం అలాంటిది ఒక చేయితో టీ షర్ట్‌ వేసుకుంటూ మరో చేతితో బాడీని బ్యాలన్స్‌ చేయాలి అంటే సాధ్యం అయ్యే పని కాదు.

కాని రకుల్‌ సాధ్యం చేసింది. వీడియోలో రకుల్‌ టీ షర్ట్‌ వేసుకుని మరీ చూపించింది. తాను వీకెండ్‌ ఛాలెంజ్‌ ను చేయడంతో పాటు రేఖ చక్రవర్తితో పాటు మరో ఇద్దరికి కూడా విసిరింది. రకుల్‌ ప్రీత్‌ మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్‌ ఎంత వైరల్‌ అవ్వనుందో చూడాలి. గత ఏడాది కాలంగా పెద్దగా సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్‌ వైపు చూస్తున్న ఈ అమ్మడు మంచి ఫిజిక్‌ తో మళ్లీ సౌత్‌ లో అవకాశాలు దక్కించుకునేందుకు సోషల్‌ మీడియాలో ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి