Begin typing your search above and press return to search.

కండోమ్‌ టెస్టింగ్ ను ఇలా సర్ది చెప్పుకుంటున్న రకుల్‌

By:  Tupaki Desk   |   26 May 2021 4:30 AM GMT
కండోమ్‌ టెస్టింగ్ ను ఇలా సర్ది చెప్పుకుంటున్న రకుల్‌
X
సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈమద్య కాలంలో కాస్త డల్‌ అయ్యింది. ఇక్కడ చిన్నా చితక సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌ లో బోల్డ్‌ గా నటించేందుకు సిద్దం అవుతోంది. బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు సినిమా లు ఉన్నాయి. అందులో ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే కండోమ్‌ టెస్టర్‌ మూవీ. ఇది ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు రకుల్‌ అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మరీ ఇంత బోల్డ్‌ పాత్రను ఎలా రకుల్‌ చేస్తుందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

రకుల్‌ ఆ పాత్రకు కమిట్‌ అవ్వడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా విడుదల తర్వాత తనను విమర్శించిన వారు కూడా ప్రశంసిస్తారు అంటూ రకుల్‌ నమ్మకం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. రకుల్‌ ఇటీవల ఒక సందర్బంగా మాట్లాడుతూ కండోమ్‌ టెస్టింగ్‌ పాత్రను చేసేందుకు ఒప్పుకున్న కారణం పై స్పష్టత ఇచ్చింది. దర్శకుడు తేజస్ డియోస్కర్ చెప్పిన కథ బాగా ఇంప్రెస్‌ చెప్పిందని పేర్కొంది.

తేజస్ డియోస్కర్ చెప్పిన కథ చాలా సెన్సిబుల్‌ గా అనిపించింది. ఇలాంటి సెన్సిబుల్‌ ప్రాజెక్ట్‌ లో చేయాలని చాలా కాలం గా అనుకుంటున్న తను వెంటనే కమిట్ అయ్యిందట. బోల్డ్‌ పాత్రే అయినా కూడా మంచి సెన్సిబులిటీ ఉన్న పాత్ర గా తాను చేయబోతున్న పాత్ర నిలుస్తుందనే నమ్మకంను ఆమె వ్యక్తం చేసింది. తప్పకుండా ఇది అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందని పేర్కొంది. ఒక మద్యతరగతి అమ్మాయిల ఆలోచనను ప్రతిభింబించేలా ఈ సినిమా ఉంటుందట. ఈ ఏడాది చివర్లో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని పేర్కొంది.