Begin typing your search above and press return to search.

వ‌ర‌ల్డ్ నెం-1 ట్రెండింగ్ సాంగ్ లో ర‌కుల్ మెరుపులు!

By:  Tupaki Desk   |   24 Jun 2022 11:30 AM GMT
వ‌ర‌ల్డ్ నెం-1 ట్రెండింగ్ సాంగ్ లో ర‌కుల్ మెరుపులు!
X
పాకిస్తాన్ సింగ‌ర్ ఆల‌పించిన‌ 'ప‌సూరి' పాప్ సాంగ్ నెట్టింట ఎంత దుమారం రేపిందో చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంగీత ప్రియుల్ని ప‌సూరి సాంగ్ ఆక‌ట్టుకుంది. దీంతో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వన్ ట్రెండింగ్ సాంగ్ గా ప‌సూరి నిలిచింది. ఫిబ్ర‌వ‌రిలో పాట రిలీజ్ అయినా ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాని ఊపేస్తుంది.

పంజాబీ-ఊర్దు మిక్సింగ్ లో రూపొందిన సాంగ్ బాలీవుడ్ లోనూ దుమారం రేపింది. తాజాగా ఈ పాట‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌ళుక్కున మెరిసింది. త‌న‌దైన శైలి స్టెప్పుల‌తో ఆక‌ట్టుకుంది. ఆ పాట‌కి సంబంధించిన డాన్స్ వీడియోని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు షేర్ చేసి త‌న‌లో డాన్సింగ్ స్కిల్స్ ని బ‌య‌ట పెట్టింది. త‌న‌లోనూ గొప్ప డాన్స‌ర్ ఉంద‌ని ఈ పాట‌తో ర‌కుల్ రుజువు చేసుకుంద‌ని చెప్పొచ్చు.

ఇప్ప‌టివ‌ర‌కు ర‌కుల్ ఏ సినిమా పాట కోసం ఇంత‌గా శ్ర‌మించి ఉండ‌దు. తొలిసారి ప‌సూరి పాట కోసం ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ అయి వీడియో చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. త‌మ‌న్నా..దిశాపటానీ లాంటి గొప్ప డాన్స‌ర్ కాన‌ప్ప‌టికీ వాళ్ల‌కి పోటీగా చేసింద‌న్నంత ఫీల్ ని తీసుకొచ్చింది. ర‌కుల్ పాట కోసం బాడీలో ప్ర‌తీ పార్ట్ ని ఎంతో సుల‌భంగా..సౌక‌ర్య‌వంత‌గా క‌ద‌ప‌గ‌లిగింది.

ముఖ్యంగా హిప్ మూవ్ మెంట్ కి వావ్ అనాల్సిందే. ఇక పాట కోసం ర‌కుల్ ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ ప‌ర్పెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. బ్లాక్ క‌ల‌ర్ టాప్ బ్లౌజ్ పై రఫ్ఫ్డ్ స్కర్ట్‌లో ర‌కుల్ కనిపించిన విధానం గ్లామర్ ప్రియుల‌కు డ‌బుల్ ట్రీట్ అద‌నం. ఫేస్ లో ఎక్స్ ప్రెష‌న్స్ చ‌క్క‌గా క్యారీ చేసింది. పాట‌లో ఫీల్ ని..ప‌ల్స్ ని ప‌ర్పెక్ట్ గా క్యాప్చ‌ర్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ర‌కుల్ ఇలాంటి డాన్స్ వీడియోలు చేయ‌డం చాలా రేర్. ఎంతో బాగా క‌నెక్ట్ అయితే త‌ప్ప ఇలాంటి సాహ‌సాల‌కు పూనుకోదు. ప‌సూరి పాట‌తో ర‌కుల్ మ‌రోసారి త‌న లో హిడెన్ ట్యాలెంట్ ని బ‌య‌ట‌కు తెచ్చింద‌ని చెప్పొచ్చు. ర‌కుల్ బాలీవుడ్ లో ఫేమ‌స్ అవ్వాల‌ని ఎంతో ప్ర‌య‌త్నిస్తుంది.

హిందీలో నిల‌దొక్కుకుని స్టార్ హీరోయిన్ల‌ స‌ర‌స‌న స్థానం సంపాదించాల‌ని క‌సిగా ప‌నిచేస్తుంది. ప్ర‌స్తుతం చేతిలో అవ‌కాశాలు బాగానే ఉన్నాయి. వాటితోనే త‌న‌లో ట్యాలెంట్ చూపించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. తాజాగా పసూరి సాంగ్ లో అమ్మ‌డి మెరుపులు క‌లిసిరావొచ్చు.