Begin typing your search above and press return to search.
ఎవరి ఆట వారిదే అంటున్న ముద్దుగుమ్మ
By: Tupaki Desk | 28 March 2021 7:30 AM GMTటాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ జీవితమును గోల్ఫ్ ఆటతో పోల్చుతూ జీవిత పాటలను చెప్పింది. జీవితం అంటేనే ఆట. ఇక్కడ ఎవరి ఆట వారే ఆడాలి. ఒకరి ఆటను మరొకరు ఆడే అవకాశం అస్సలు లేదు. ఈ ఆటలో కష్టాలు.. సుఖాలు రెండు ఉంటాయి. ఆట సమయంలో వచ్చే ఫీలింగ్స్ ను ఆధారంగా జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటూ వేదాంత ధోరణిలో ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. జీవితాన్ని గోల్ఫ్ ఆట మాదిరిగా ఆడితే ఎప్పుడు విజయాలు దక్కుతాయని సంతోషంగా ఉంటామని ఆమె చెప్పుకొచ్చింది.
రకుల్ ఇంకా మాట్లాడుతూ.. ప్రతి ఆటలో కూడా ప్రత్యర్థి అనేవాడు ఉంటాడు. కానీ గోల్ఫ్ లో మాత్రమే ప్రత్యర్థి ఉండరు. మనం ఎంత వేగంగా బంతిని కోడితో అంత విజయం. అలాగే మన జీవితం కూడా ఉంటుంది. ఎంతగా కష్టపడితే అంత లాభం.. దానికి తగ్గ విజయం లభిస్తుంది. గోల్ఫ్ లో బంతిని కొట్టిన సమయంలో తలను కిందకు దించాల్సి ఉంటుంది. జీవితంలో ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనేది ఆ విషయం చూపిస్తుంది. గోల్ఫ్ లో బంతి ఒక సారి మిస్ అయితే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి విజయాన్ని సాధించవచ్చు. మా నాన్న నాకు చిన్నప్పుడు గోల్ఫ్ నేర్పించేందుకు తీసుకు వెళ్లిన సమయంలో ఇష్టం లేకుండానే నేర్చుకున్నాను. కానీ ఆటలో ప్రావీణ్యం సాధించిన తర్వాత గోల్ఫ్ అంటే ఇష్టం పెరిగిందని రకుల్ చెప్పుకొచ్చింది.
తాను గోల్ఫ్ ఆట ను తన జీవితానికి అన్వయించుకుని ముందుకు సాగుతున్నాట్లుగా చెప్పుకొచ్చింది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసింది. ఆ సినిమా త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. హిందీలో కూడా ఈమె సినిమాలు చేస్తోంది. గతంలో మాదిరిగా వరుస సినిమాలు రకుల్ దక్కించుకోలేక పోతుంది. దాంతో ఈమె కెరీర్ చివరి దశకు చేరిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రకుల్ మాత్రం మళ్ళీ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది.