Begin typing your search above and press return to search.
బ్యూటీ చేయి జారుతున్న ఆఫర్లు
By: Tupaki Desk | 24 Feb 2019 5:30 PM GMTరెండేళ్ల క్రితం దాకా ఫుల్ ఫామ్ లో ఉంటూ తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కు టైం ఏ మాత్రం కలిసి రావడం లేదు . కార్తితో ఖాకీ తరవాత చేసిన దేవ్ తనకు మంచి బ్రేక్ గా నిలుస్తుంది అనుకుంటే అది ఏకంగా ఆ హీరో కెరీర్ లోనే వరస్ట్ మూవీగా పేరు తెచ్చుకోవడంతో ఆశలన్నీ నీరుగారిపోయాయి. దెబ్బకు టాలీవుడ్ సంగతేమో కాని ఇది ఇప్పుడు తమిళ్ అవకాశాలకే ఎసరు పెట్టేలా ఉంది. ఇదిలా ఉండగా వెంకటేష్ నాగ చైతన్య కాంబోలో రూపొందబోయే వెంకీ మామలో చైతుకి జోడిగా తొలుత అనుకున్నది రకుల్ నే. అయితే తర్వాత ఏం జరిగిందో కాని ఫైనల్ గా ఆ సీటులోకి రాశి ఖన్నా వచ్చి కూర్చుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న రట్ససన్ రీమేక్ లో కూడా రకుల్ నే అడిగారట. సడన్ గా అనుపమ పరమేశ్వరన్ సీన్ లోకి వచ్చేసి ఆ ఛాన్స్ తీసేసుకుంది. ఇప్పుడు విడిగా ఎవరైనా పిలుస్తారేమో అని చూస్తే దేవ్ ఫలితం దెబ్బకు మేనేజర్ కు కాల్స్ రావడం కూడా ఆగిపోయాయి. రకుల్ కు ఇదంతా ఇబ్బంది కలిగించే వ్యవహారమే. గతంలో దర్శకుడు హరీష్ శంకర్ దాగుడుమూతలు అనే కామెడీ మల్టీ స్టారర్ అనుకున్నప్పుడు ఒక హీరొయిన్ గా రకుల్ నే అనుకున్నారు. అయితే అది మొదలుకాకుండానే ఆగిపోయింది.
హరీష్ శంకర్ దాన్ని వదిలేసి వరుణ్ తేజ్ తో వాల్మీకికి షిఫ్ట్ అయిపోయాడు. అయినా రకుల్ కి నో కాల్. సూర్యతో నంద గోపాల కృష్ణన్ చేసింది కాని అందులో తనకన్నా సాయి పల్లవి పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని ఇప్పటికే కోలీవుడ్ టాక్ ఉంది. ఈ నేపధ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో దారులు దాదాపు బ్లాక్ అయినట్టే. ఏదైనా మేజర్ బ్రేక్ వస్తే తప్ప ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది