Begin typing your search above and press return to search.

నాకు అలవాటు లేదు: రకుల్

By:  Tupaki Desk   |   14 Feb 2018 11:21 AM GMT
నాకు అలవాటు లేదు: రకుల్
X
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ 16వ తేది కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తోంది. తన మొదటి హింది సినిమా అయారి ఆ రోజే విడుదల కానుంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ మీడియాకు విస్తృతంగా అందుబాటులో ఉండటంతో పాటు హాట్ ఫోటో సెషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్కడ కొత్తగా అభిమానులను ఏర్పరుచుకునే పనిలో బిజీగా ఉంది. అందులో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రకుల్ మందు కొట్టడం గురించి క్లారిటీ ఇచ్చేసింది. తాను ఏ రూపంలోనూ మందు కొట్టడాన్ని ఇష్టపడనని, సినిమా పరిశ్రమలో అది తీసుకోవడం సహజమే అయినప్పటికీ తాను మాత్రం ఆ అలవాటుకు లొంగిపోలేదని చెప్పేసింది. ఇక ముందు కూడా దాని జోలికి వెళ్ళే సమస్యే లేదని తేల్చేసింది. మందు అలవాటు ఉన్నా లేకపోయినా ఏ హీరొయిన్ పబ్లిక్ గా నేను తాగుతాను అని చెప్పిన దాఖలాలు తక్కువే. కాని బానిసైన వాళ్ళ నెంబర్ తక్కువేమీ లేదు.

తెలుగు సినిమాల వరకు కొత్తగా దేనికి సైన్ చేయని రకుల్ గురి బాలీవుడ్ మీదే ఉంది. లాస్ట్ ఇయర్ స్పైడర్, జయ జానకి నాయక చేదు ఫలితాలను ఇస్తే రారండోయ్ వేడుక చూద్దాం తనవరకు మంచి పేరు తీసుకొచ్చింది. ఖాకీ హిట్ అయినా క్రెడిట్ మొత్తం కార్తీ లాగేసుకున్నాడు. మరోపక్క నెలకో కొత్త బ్యూటీ టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. పోటీ ఎక్కువైన నేపధ్యంలో నిర్మాతలకు ఆప్షన్స్ పెరిగిపోయాయి. దీంతో అయారి కనక హిట్ అయితే ఏదోలాగా హిందీలో ఆఫర్స్ పట్టుకోవచ్చు అనే ప్లాన్ లో ఉంది రకుల్.

తాను ఎవరితోనో ప్రేమలో ఉన్నట్టు వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన రకుల్ అలాంటిది ఏమి లేదని కుండ బద్దలు కొట్టింది. లైఫ్ రొటీన్ గా మారిపోయి బాగా బోర్ కొడుతోంది అంటున్న రకుల్ ఏదైనా ఛాలెంజింగ్ లాంటిది కావాలని వెయిట్ చేస్తోందట. దిల్ రాజు బ్యానర్ లో దర్శకుడు హరీష్ శంకర్ మూవీ ప్రపోజల్ తన వద్ద పెండింగ్ లో ఉందని టాక్. అది ఓకే అయితే ఈ ఇయర్ లో తనకు టాలీవుడ్ ఫస్ట్ మూవీ అదే అవుతుంది.