Begin typing your search above and press return to search.

రకుల్ పెళ్ళి.. తెలుగబ్బాయే కావచ్చు..

By:  Tupaki Desk   |   11 Dec 2017 4:56 AM GMT
రకుల్ పెళ్ళి.. తెలుగబ్బాయే కావచ్చు..
X
హీరోయిన్స్ పెళ్లంటా.. అనగానే ఎవ్వరైనా సరే చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవరా అని చూస్తుంటారు. అప్పటివరకు ఎంతో ఫేమస్ అయిన అందాల భామలు ఒక్కసారి వారి వరుడిని వెతుక్కుంటే ఇక అతను కూడా సెలబ్రెటీ అవ్వడం ఖాయం. ఇక అతను ఆల్రెడీ సెలబ్రెటీ అయ్యుంటే.. ఇక చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం హీరోయిన్స్ కి పెళ్లి ఘడియలు దగ్గరపడుతున్నాయా అనే విధంగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

హీరోయిన్స్ కూడా అయితే అవ్వచ్చు అనే విధంగా సమాధానం ఇస్తున్నారు. అయితే రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో తన స్టైల్ లో పెళ్లి మ్యాటర్ గురించి కొన్ని స్వీట్ కామెంట్స్ చేసింది. ఎప్పుడు ఏం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు. సో.. నా పెళ్లి కూడా జరగవచ్చు.. అది కూడా ఒక తెలుగబ్బాయితో వివాహం జరగవచ్చు అని వివరించింది. దీంతో అమ్మడు కూడా సమంత లాగా టాలీవుడ్ హీరోని చేసుకుంటుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో కుర్ర హీరోలు కూడా చాలామందే ఉన్నారు. రకుల్ లాంటి అందగత్తె అండ్ స్టార్ హీరోయిన్ ని జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి ఛాన్స్ దొరికితే ఏ మాత్రం వదిలిపెట్టరు. అయితే రకుల్ కి ఇన్నేళ్లలో ఏ హీరో నుంచి ప్రపోజల్స్ రాలేదట. మొదట్లో ఓ హీరో ఆమె కెరీర్ కు హెల్ప్ చేశాడని వారిద్దరు లవర్స్ అని రూమర్స్ బాగానే వచ్చాయి. కాని రకుల్ వాటిని పట్టించుకోలేదు. మరి పెళ్లి చేసుకుంటే అమ్మడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలి.. ఆ అదృష్టవంతుడు ఎవరో..