Begin typing your search above and press return to search.

రకుల్ ని పుష్ప రాజ్ ఆవహించాడు..!

By:  Tupaki Desk   |   24 Nov 2022 4:32 AM GMT
రకుల్ ని పుష్ప రాజ్ ఆవహించాడు..!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ దేశం మొత్తం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పుష్ప రాజ్ నీయవ్వ తగ్గేదేలే అంటూ రికార్డుల పని పట్టాడు అల్లు అర్జున్. సుకుమార్ క్రియేటివిటీ 100 పర్సెంట్ రీచ్ అయిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. పుష్ప తో పాన్ ఇండియా మార్కెట్ తెరిచేశాడు అల్లు అర్జున్. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే పుష్ప రాజ్ ఊర మాస్ యాటిట్యూడ్ కి ఫిదా అయిపోయారు.

అందుకే తెలుగు వసూళ్లకి ఈక్వల్ గా పుష్ప సినిమా హిందీలో కలెక్ట్ చేసింది. ఏడాది క్రితం రిలీజైన ఈ మూవీ గురించి ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ప్రస్తావిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పుష్ప మాయలో పడింది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండే రకుల్ రీసెంట్ గా బాగా నచ్చిన సినిమా ఏది అని ఓ అభిమాని అడిగితే.. పుష్ప అంటూ పుష్ప రాజ్ మేనరిజం అయిన తగ్గేదేలే సిగ్నేచర్ ని చూపించింది.

రకుల్ లో పుష్ప రాజ్ ఆవహించినట్టుగా అమ్మడు అదరగొట్టేసింది. సినిమా రిలీజై సంవత్సరం అవుతుంది.. అంతేకాదు ఓటీటీ లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. అయినా కూడా పుష్ప హంగామా కొనసాగుతూనే ఉంది. రకుల్ చేసిన పుష్ప మేనరిజం కి అల్లు మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

పుష్ప పార్ట్ 1 ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా పుష్ప పార్ట్ 2 ని కూడా అదే రేంజ్ లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. అసలు సినిమా పాట్ 2 లోనే ఉంటుందని సుక్కు చెబుతున్నారు. పుష్ప 1 ఏర్పరచిన అంచనాలతో పుష్ప 2 మరింత గ్రాండ్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. పుష్ప 2 లో మరికొన్ని కొత్త పాత్రలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. పుష్ప రాజ్ వర్సెస్ భన్వర్ సింగ్ షెఖావత్ మధ్య ఫైట్ సీక్వల్ లో ఆసక్తికరంగా ఉండబోతుందని అంటున్నారు.

పుష్ప 2 కేవలం ఇండియాలో కాదు బ్యాంకాక్ కూడా వెళ్తారని టాక్. సుకుమార్, అల్లు అర్జున్ మరో అద్భుతాన్ని ప్రేక్షకులకు అందించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 2023 సెకండ్ హాఫ్ లో పుష్ప 2 రిలీజ్ ఉంటుందని టాక్. పార్ట్ 2 లో కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.