Begin typing your search above and press return to search.

రకుల్ కి కాబోయేవాడి అర్హతలివే

By:  Tupaki Desk   |   30 May 2017 1:23 PM GMT
రకుల్ కి కాబోయేవాడి అర్హతలివే
X
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ధృవ అంటూ రామ్ చరణ్ తో భారీ సక్సెస్ సాధించిన రకుల్.. ఇప్పుడు రా రండోయ్ వేడుక చూద్దాం అంటూ అక్కినేని నాగచైతన్యతో రొమాన్స్ చేసి మెప్పించింది. రా రండోయ్ కూడా సక్సెస్ సాధించడంతో పాటు.. రకుల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్ ట్యాలెంట్ కు బోలెడంత పేరు తెచ్చిపెట్టింది.

ఈ సినిమాలో రకుల్ పాత్ర కీలకమే కాకుండా.. ఆమె నటన మూవీకి బేస్ గా కూడా నిలవడం విశేషం. ఇండస్ట్రీ నుంచి ఆడియన్స్ నుంచి బోలెడన్ని ప్రశంసలు వస్తుండడంతో తెగ మురిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్.. తెగ సంతోషంగా ఉంది. ఇదే జోష్ లో కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా చెప్పేసింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా.. తన భర్త ఇలా ఉండాలి అంటూ కొన్ని నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయట. ఎప్పుడూ తను నవ్వుతూ.. నలుగురినీ.. ముఖ్యంగా తనను నవ్వించే వాడు అయి ఉండాలట. దీంతో పాటు తనను బాగా ప్రేమించాలట.. పైగా బాగా పొడుగ్గా ఉండే భర్త కావాలంటోంది రకుల్.

అంతేలెండి.. 5 అడుగుల 9 అంగుళాల పొడుగరి అయిన రకుల్ ఆరడుగులు ఆజానుబాహుడిని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు స్పైడర్ లో నటిస్తుండగా.. దసరాకు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ రీసెంట్ గా మహేష్ స్వయంగా చెప్పేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/