Begin typing your search above and press return to search.

చరణ్ చాలా చిలిపి.. తట్టుకోవడం కష్టం

By:  Tupaki Desk   |   2 Dec 2016 4:47 AM GMT
చరణ్ చాలా చిలిపి.. తట్టుకోవడం కష్టం
X
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ మరో వారంలో థియేటర్లలోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ధృవ కోసం ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చెర్రీ అండ్ టీం.. బోలెడన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు చెప్పేస్తోంది.

ఎప్పుడు కనిపించినా కాసింత సీరియస్ గా డిగ్నిఫైడ్ గా కనిపించే చరణ్ గురించి.. బైటకు తెలియని నిజాలు చెప్పేస్తోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. 'చరణ్ బాగా చిలిపి. సీరియస్ గా వచ్చేసి.. ఇవాళ షూటింగ్ ఇక్కడ.. ఇలా అంటూ చెప్పేస్తాడు. కానీ రియాలిటీ వేరేలా ఉంటుంది. షూటింగ్ ఎక్స్ టెండ్ చేస్తున్నామంటూ సడెన్ గా అనౌన్స్ చేస్తాడు. అందులో నిజం ఉండదు. ఇలాంటి ప్రాంక్స్ విషయంలో చరణ్ దిట్ట' అంటున్న రకుల్ ప్రీత్.. 'చరణ్ స్టార్ హీరో అయినా మనసులో మాత్రం ఇంకా చిన్న పిల్లాడే. అలాంటి కోస్టార్ దొరకడం చాలా అరుదు. అందుకే బ్రూస్ లీ వెంటనే ధృవలో కూడా కలిసి నటించాం' అంటోంది రకుల్.

తామిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పండడానికి.. కశ్మీర్ షెడ్యూల్.. అక్కడ కలిసి చేసిన వర్కవుట్స్ కారణం అన్నది రకుల్ వెర్షన్. అయితే.. 'మా ఇద్దరి కెమిస్ట్రీ గురించి మేం చెప్పడం కంటే.. ఆడియన్స్ చెబితేనే బాగుంటుంది. రకుల్ చాలా డిసిప్లిన్డ్ పర్సన్. నేను పని చేసిన వాళ్లలో బాగా హార్డ్ వర్కింగ్' అంటున్నాడు చెర్రీ.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/