Begin typing your search above and press return to search.
ఆ హీరో సినిమాకు పచ్చజెండా ఊపిన రకుల్?
By: Tupaki Desk | 27 Dec 2018 7:45 AM GMTటాలీవుడ్ లో వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ ట్యాగ్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు సినిమా 'స్పైడర్' ఇచ్చిన షాక్ తర్వాత ఎందుకో తెలుగు సినిమాలు సైన్ చేయడం తగ్గించింది. తమిళం.. హిందీ పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. రకుల్ ప్రస్తుతం మూడు తమిళ సినిమాలు.. రెండు హిందీ చిత్రాలు చేస్తోంది. తాజాగా తెలుగులో ఒక సినిమాకు పచ్చజెండా ఊపిందని వార్తలు వస్తున్నాయి.
హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. ఒకటి వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమా కాకుండా నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు నిర్మాతలు రకుల్ ను సంప్రదించారని.. పాత్ర నచ్చడంతో రకుల్ కూడా ఒకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే యేలేటి సినిమాలో నటించేందుకు నితిన్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదని కూడా కొందరు అంటున్నారు. ఒకవేళ నితిన్ ఈ సినిమాలో నటించేది నిజమే అయితే మాత్రం ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించడం మాత్రం పక్కా అని సమాచారం. వరసగా స్టార్ హీరోలతో నటిస్తున్న రకుల్ ఇప్పుడు నితిన్ లాంటి మిడ్ రేంజ్ హీరో తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రం సర్ ప్రైజే.
ఇదిలా ఉంటే రకుల్ మరో తెలుగు సినిమా 'వెంకీ మామ' లో కూడా నటించేందుకు చాలా నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంకటేష్ - నాగచైతన్య కాంబినేషన్ లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమాలో చైతుకు జోడీగా రకుల్ నటిస్తుందట. ఎదేతేనేం.. తమిళం.. హిందీ.. తెలుగు.. అన్నీ భాషలను కవర్ చేస్తోంది రకుల్ పాప!