Begin typing your search above and press return to search.

రకుల్ కష్టాలు కంటిన్యూస్

By:  Tupaki Desk   |   6 Feb 2018 5:43 AM GMT
రకుల్ కష్టాలు కంటిన్యూస్
X
గతేడాది సమ్మర్ లో రారండోయ్ వేడుక చూద్దాం మూవీతో సక్సెస్ సాధించిన తర్వాత టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి వార్త వినిపించలేదు. స్పైడర్ డిజాస్టర్.. ఖాకీ హిట్ అయినా ఈ భామ పేరు లేకపోవడం.. అనుకున్న ప్రాజెక్టులు కార్యరూపం దాల్చకపోవడం లాంటివి జరిగాయి.

ఇదే సమయంలో ఓ బాలీవుడ్ మూవీని పూర్తి చేసింది రకుల్ ప్రీత్. అయ్యారే అంటూ సిద్ధార్హ మల్హోత్రా.. మనోజ్ బాజ్ పాయ్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రాన్ని కంప్లీట్ చేసింది. గత కొన్ని వారాలుగా ఈ మూవీ ప్రచారం కోసం దేశం మొత్తం చక్కర్లు కొట్టేస్తోంది. అనుకున్న ప్రకారం అయితే.. ఫిబ్రవరి 9నే అయ్యారే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడీ సినిమా విడుదలపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఇందుకు కారణం.. ఈ సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ అందకపోవడమే. సెన్సార్ సభ్యులు తిరస్కరించగా.. ఇప్పటికే రివైజింగ్ కమింటీ దగ్గరకు వెళ్లిన అయ్యారేకు.. ఇంకా అక్కడి నుంచి క్లియరెన్స్ రాలేదు.

ఈ సినిమాను ఆర్మీ చేపట్టే కోవర్ట్ మిషన్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించడంతో.. రక్షణ శాఖ కూడా జోక్యం చేసుకుందట. భద్రతకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను సినిమాలో చూపించారని భావిస్తున్నారట. కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేయాలంటూ దర్శకుడు నీరజ్ పాండేకు సూచించినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు మార్పులు చేసేయడం అంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకే రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 9 నుంచి వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.