Begin typing your search above and press return to search.

ఆ ముచ్చ‌ట్లేంటో మాకూ చెప్పండ‌మ్మా

By:  Tupaki Desk   |   24 Dec 2015 5:33 AM GMT
ఆ ముచ్చ‌ట్లేంటో మాకూ చెప్పండ‌మ్మా
X
విధి రాత అనేది ఒక‌టుంటుంది. బ్ర‌హ్మ ఎవ‌రి నుదిట‌న ఎలా రాశాడో అలానే జ‌రుగుతుంద‌ని వేదాంతం చెబుతుంటారు కొంద‌రు. ఇదిగో ఈ అమ్మ‌ళ్లు మ‌రీ ఇలా ఆశ్చ‌ర్య‌పోతూ క‌నుబొమ‌లు ఎగ‌రేస్తూ ఏం మాట్లాడుకుంటున్నారో ఇట్టే ప‌సిగ‌ట్టేయ‌వచ్చు. పిక్చ‌ర్లో ఉన్న ర‌కూల్ ప్రీత్ సింగ్ - అదాశ‌ర్మ ఏం మాట్లాడుకుంటున్నారంటే....

నేను ముంబై వ‌దిలి వ‌చ్చేశాను. నువ్వేమో ఢిల్లీ వ‌దిలి వ‌చ్చేశావ్‌. ఇద్ద‌రం హైద‌రాబాద్‌ లోనే సెటిలైపోయాం. ఏంటో డెస్టినీ అంటే అదేనేమో! ఎవ‌రు ఎప్పుడు ఎక్క‌డ ఎలా సెటిల‌వుతారో ఆ పైవాడే నిర్ణ‌యిస్తాడు. అలా మ‌నమంతా తెలుగు రాష్ర్టంలో సెటిలైపోయాం. ఇంకా చెప్పాలంటే తెలుగువారి ఆద‌ర‌ణ‌ - మంచిత‌నం వ‌ల్ల‌నే మ‌నం ఇంకా ఇక్క‌డున్నాం అంటూ ముచ్చ‌టించుకుంటున్న‌ట్టే ఉంది క‌దూ ఈ ఫోజు. నిన్న‌టిరోజున గ‌ర‌మ్ ఆడియో వేడుక‌లో క‌నిపించిన దృశ్య‌మిది. ఆది హీరోగా, అదాశ‌ర్మ హీరోయిన్‌ గా మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సాయికుమార్ నిర్మించిన చిత్ర‌మిది.

అదాశ‌ర్మ ఎలానూ ఆది హీరోయిన్‌. ఇక ర‌కూల్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిధిగా విచ్చేసింది. ర‌కూల్ ఇంత‌కుముందే ఆది స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టించింది కాబ‌ట్టి ఆ స్నేహంతోనే ఇలా ఆడియోకి విచ్చేసి టీమ్‌ ని బ్లెస్ చేసింది. హ‌ఠాత్తుగా ఈ ముద్దుగుమ్మ‌లిద్దరూ ఇలా స‌ర్‌ ప్రైజింగ్ అయిపోయేంత‌గా అక్క‌డ ఏదో జ‌రిగింది మ‌రి.