Begin typing your search above and press return to search.
నేనూ వీకే అన్న రకుల్
By: Tupaki Desk | 16 Jan 2016 7:53 PM GMTడ్యాన్సుల్లోనూ, ఫైట్లలోనూ ఇరగదీసే ఎన్టీఆర్ ఈమధ్య విలేకర్లతో మాట్లాడుతూ నేను రొమాన్స్‌లో వీక్ అని ఒప్పుకొన్నాడు. ఆ విషయంపై రాజమౌళితోపాటు, నా భార్య కూడా నన్ను కొశ్చెన్ చేస్తుంటారని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ ఆ మాట చెప్పినప్పట్నుంచి... నిజంగా ఎన్టీఆర్ రొమాన్స్ సన్నివేశాలు చేయడంలో వీకా? ఆ విషయంపై ఆయనతో కలిసి నటించిన కథానాయికల అభిప్రాయమేమిటి? విషయంపై కాన్సంట్రేట్ చేసింది మీడియా. ఇటీవల రకుల్‌ని ఆ మాట అడిగారు విలేకర్లు. ఆ ప్రశ్నకు రకుల్ బదులిస్తూ ``ఎన్టీఆర్ ఒక్కరే కాదండీ... నేను కూడా రొమాన్స్‌లో వీకే`` అని చెప్పుకొచ్చింది.
``రొమాన్స్ సన్నివేశాలంటే అందరికీ భయంగానే ఉంటుంది. అయితే ఎలాగైనా ఫస్ట్ షాట్‌లోనే ఓకే చేసేయాలి అని ఇన్వాల్వ్ అయ్యి నటిస్తుంటామని చెప్పింది రకుల్. కానీ ఎన్టీఆర్ రొమాంటిక్‌లో వీకన్న విషయం మాత్రం నాకు సెట్స్‌లో ఏమీ కనిపించలేదని నవ్వేసింది. నాన్నకు ప్రేమతోకి వస్తున్న స్పందనపై రకుల్ హ్యాపీగా ఉంది. పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో నటించానన్న సంతృప్తి ఉందని ఆమె చెప్పింది. కొత్తగా నితిన్‌తో కలిసి నటించబోయే చిత్రానికి ఓకే చెప్పేశానని తెలిపింది.