Begin typing your search above and press return to search.
ఇద్దరూ అందగత్తలే.. మరి నటనో??
By: Tupaki Desk | 30 Jun 2017 4:36 AM GMTతెలుగు సినిమా తెర పై అతి తక్కువ కాలం బతికే ఒక సినిమా పాత్ర ఉంది. దురదృష్టం కొద్ది అది అతి ముఖ్యమైన పాత్రనే అదే. హీరో సరసన నటించే హీరోయిన్. అవును మన కథలు ఎక్కువగా హీరో చుట్టే తిరుగుతాయి. హిరోయిన్లు కేవలం అందానికే పరిమతం అవుతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అవే చేయడానికి ఇష్టపడుతున్నారు. మామూలు ఆడపిల్లలా కనిపించడానికి ఏ హీరోయిన్ అంత తొందరగా ఒప్పుకోవటం లేదు. నిత్య మీనన్, కీర్తి సురేశ్ లాంటి హిరోయిన్లు తప్పితే మిగిలిన అందరూ వాళ్ళ సొగసలు ఆరబోసి ఆఫర్లు కొట్టే రకమే.
అలాంటి వాళ్ళలో మన తెలుగులో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ముందు ఉంది. నటన అంతగా ఏమి చేయకపోయినా తన అందంతో ఏదో నెట్టుకువస్తుంది. రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాలో ‘పరేషాను రా’ పాటలో అవసరానికి మించి వడ్డించింది. ఈ మధ్యనే పల్లెటూరు అమ్మాయిగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’లో కూడా అందాన్ని చూపించే అవకాశం లేదుకానీ దొరికిన ప్రతి చోట చెలరేగిపోయింది అనే చెప్పాలి. కాకపోతే ఎప్పుడు అటువంటి రోల్సే వస్తాయి అని ఏంటి నమ్మకం చెప్పండి కాస్త నటన కూడా నేర్చుకుంటే మంచిది కదా? కానీ ఈ అమ్మడుకి ఆఫర్లు బాగానే వస్తున్నాయి తెలుగులో. రకుల్ డేట్స కోసం ఎదురుచూసే సినిమాలు లేకపోలేదు. ఇక్కడే రకుల్ కి కొత్త సమస్య వచ్చిపడింది.
దువ్వాడ జగన్నాధం సినిమాలో పూజ చూపించిన సొగసులుకు తెలుగు యూత్ అంతా ఆబగా చూస్తూ ఉండి పోయారు అనే చెప్పాలి. దీనితో రకుల్ డేట్స్ దొరక్కపోతే పోనివ్వండి పూజ హెగ్డేను తీసుకుందాం అని యు-టర్న్ తీసుకుంటున్నారు ప్రొడ్యూసర్లు. తీసుకుంటే తీసుకున్నారు కానీ రకుల్, పూజ ఇద్దరు అందాల ఆరబోతలో బీభత్సం కావచ్చు కానీ మంచి నటన ఉన్న పాత్రలు ఇస్తే ఎంత వరకు చేయగలరు అనేది ప్రశ్నార్ధకమే. పూజ ఈ విషయంలో ఇంకా చాలానే నేర్చుకోవాలి అని తెలుస్తుంది. మరి ముందుముందు వీళ్ళ ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/