Begin typing your search above and press return to search.

కేన్స్ బ్యూటీస్ పారిపోవాలి!

By:  Tupaki Desk   |   29 May 2019 4:50 AM GMT
కేన్స్ బ్యూటీస్ పారిపోవాలి!
X
ఒకే సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌లు ఉంటే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా క్యాట్ ఫైట్ త‌ప్ప‌నిస‌రి. ఇరువురు మ‌గువ‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది! అన్న సూత్రం ప్రాతిప‌దిక‌గా.. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ వెరీ వెరీ కామ‌న్. ప్ర‌స్తుతం ర‌కుల్- సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య అలాంటి గ్యాప్ ఉందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఏదో మొహ‌మాటానికి ఆ ఇద్ద‌రూ ఒక‌రి గురించి ఒక‌రు పొగుడుకున్నా కానీ.. వీళ్ల మ‌ధ్య‌ ఇంకేదో జ‌రుగుతోంది అన్న ముచ్చ‌ట టాలీవుడ్ మీడియాలో విస్త్ర‌తంగా సాగుతోంది. స‌రిగ్గా ఇలాంటి స‌న్నివేశంలో ప్రీరిలీజ్ వేడుక‌లో అది కాస్తా ఓపెన్ అయ్యింద‌నే చెప్పాలి.

ఎన్‌ జీకే ప్రీరిలీజ్ స్పీచ్ లో ఎక్క‌డా సాయిప‌ల్ల‌వి పేరైనా ప్ర‌స్థావించ‌ని ర‌కుల్.. అందుకు త‌గ్గ‌ట్టే ర‌కుల్ పేరును సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్థావించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇంత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏం జ‌రుగుతోంది? మొన్న ఇంట‌ర్వ్యూలో సాయి ప‌ల్ల‌వి కూడా ఒక గొప్ప న‌టి అంటూ ముక్తాయించి వ‌దిలేసింది..? కానీ పెద్ద‌గా ఏమీ పొగిడేయ‌లేదు. ఇక ప్రీరిలీజ్ లో క‌ళ్ల‌న్నీ ర‌కుల్ స్టైల్ పైనే..!! మొన్న జ‌రిగిన కేన్స్ 2019 సంబ‌రాల్లో ఇంతందాన్ని చూడ‌లేదే! అంటూ మీడియా ఒక‌టే గుస‌గుస‌లాడేసింది. పీసీ-ఐష్‌-కంగ‌న వంటి స్టార్లు సైతం ర‌కుల్ ఫ్యాష‌న్ ముందు దిగ‌దుడుపే అంటూ సెటైర్లు పేలాయి. మొత్తానికి చ‌క్క‌న‌మ్మ ఫ్యాష‌న్ షో అదిరిపోయింది.

ఎన్‌ జీకే వేడుక‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ .. సెల్వ రాఘవన్‌ గారికి నేను పెద్ద ఫ్యాన్‌ ని అని ... 7/జి బృందావన్‌ కాలనీ క‌న్న‌డ రీమేక్ లో న‌టించాన‌ని ... అప్పటి నుండి సెల్వసార్‌ తో పనిచేయాలని ఎదురు చూశాన‌ని ర‌కుల్ అంది. సూర్యగారు అమేజింగ్‌ ప్రొఫెషనల్‌ యాక్టర్‌. ఆయనతో పని చేయడం సంతోషం అని స్పీచ్ ని ముగించేసింది. ఇక ఇదే వేదిక‌పై సాయిప‌ల్ల‌వి సైతం మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచి సూర్య సార్‌ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఇప్పుడు సినిమా చేయడం కలలాగా ఉంది. ఆయన సెట్‌లో చాలా సింపుల్‌ గా ఉంటారు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు షూటింగ్‌ సమయంలో ఎంతగానో సపోర్ట్‌ అందించారు. శ్రీరాఘవగారు ఓ విజనరీతో సినిమా చేస్తారు. ఆయన ప్రతి క్యారెక్టర్‌ ను డిఫరెంట్‌ గా చూపిస్తారు. ఈ సినిమా నుండి చాలా నేర్చుకున్నాను.. మిగ‌తా టీమ్ కి థాంక్స్ అని ముక్తాయించేయ‌డం కొస‌మెరుపు. మొత్తానికి చ‌క్క‌న‌మ్మ‌ల మ‌ధ్య అస‌లేం జ‌రుగుతోంది? అస‌లే సాయి ప‌ల్ల‌వికి ఎవ‌రితోనూ అంత తేలిగ్గా స‌రిప‌డ‌ద‌ని అంటారు. అందుకే ర‌కుల్ తో వ‌చ్చిందా చిక్కు?!